‘ఎవడే సుబ్రమణ్యం’తో టాలీవుడ్ పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్. మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆ తర్వాత కళ్యాణ వైభోగమే, టాక్సీవాలాతో యూత్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. తాజాగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మూడు భాషల్లోని చిత్రాల్లో బాలనటిగా నటించిన మాళవిక, 2012లో మలయాళంలో బ్లాక్ బటర్ ఫ్లై సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘కుకూ సినిమాలో అంధురాలిగా ఆమె నటన ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకొంది
విజయ్ గురించే ప్రశ్నలు
మాళవిన నాయర్ మాట్లాడుతూ..' ఉహా తెలియని రోజుల్లో ఎల్‌కేజీలోనే ఒకబ్బాయిని ఇష్టపడ్డా. అదే నా ఫస్ట్ క్రష్. రోజూ తనను చూసేదాన్ని. క్లాస్‌మేట్స్ అందరం కలిసి తీసుకున్న గ్రూప్ ఫొటోని దాచుకున్నా. ఆ అబ్బాయి ఫొటోను స్కెచ్‌తో రౌండప్ చేసి అప్పుడప్పుడు చూసుకుని మురిసిపోయేదాన్ని. ఆరో తరగతి తర్వాత నేను వేరే స్కూల్‌కు మారిపోవడంతో ఆ కథ ముగిసిపోయింది. ఇప్పుడు అది తలుచుకుంటే నవ్వొస్తుంది. ఆ తర్వాత ఇంటర్ వరకు ఢిల్లీలో చదువుకున్నా. మొదటి ఏడాది వేసవి సెలవుల్లో ‘ఎవడే సుబ్రమణ్యం’ షూట్‍లో పాల్గొన్నా. ఫస్ట్ నేను పైలెట్ కావాలనుకున్నా. కానీ వరుస సినిమాల వల్ల నా డ్రీమ్ నెరవేరలేదు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో డిగ్రీ చదివా. ఆ సమయంలో నా స్నేహితులంతా విజయ్ దేవరకొండ గురించే అడిగేవారు. వాళ్లకు సమాధానం చెప్పలేక చచ్చిపోయేదాన్ని. అలా సినిమాల్లో నటిస్తూనే డిగ్రీ పూర్తి చేశా. ' అని తన అనుభవాలను పంచుకున్నారు.
మహానటిలో పాత్రకు మంచి ఆదరణ
‘మహానటి’లో నేను పోషించిన అలిమేలు పాత్రకు మంచి ఆదరణ లభించిందని మాళవిక తెలిపింది. ఆ సినిమా తర్వాత చాలామంది తల్లి పాత్రల్ని ఆఫర్ చేశారు. అప్పటికి నాకు కేవలం ఇరవై ఏళ్ల వయసే కాబట్టి సున్నితంగా తిరస్కరించాను. అలాంటి పాత్రలు నా కెరీర్‌కు రిస్కే కానీ.. చిన్న పాత్ర అయినా ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయేలా చేయాలనే నా లక్ష‍్యమని అన్నారు. అలాగే ‘టాక్సీవాలా’లో శిశిర, ‘మహానటి’లో అలిమేలు పాత్రలు. నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటానని మాళవిక నాయర్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment