
‘ఎవడే సుబ్రమణ్యం’తో టాలీవుడ్ పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్. యంగ్ హీరో నాగశౌర్యతో ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి సినిమాలో కనిపించింది. ఆ చిత్రంలో బోల్డ్ సీన్స్‌లో తనదైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం అన్నీ మంచి శకునములే అంటూ మరోసారి టాలీవుడ్ సినీ ప్రియులను పలకరించేందుకు సిద్ధమైంది. నందిని రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మే 18న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది భామ.
(ఇది చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న 'తోడేలు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
ప్రమోషన్లలో భాగంగా మాళవిక తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తాజాగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్‌తో కలిసి వీడియోలో కనిపించింది. ఆయనతో మాట్లాడుతూ.. 'నిన్ను ఉంచుకుంటాను అబ్బాయి' అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. దానికి అనుదీప్ సిగ్గుపడుతూ మరీ కళ్లు మూసుకున్నారు.
ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే కేవలం సినిమా ప్రమోషన్ల కోసమే చేసినా.. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అంతే కాకుండా 'అలా అనుదీప్ గారిని ఉంచుకోవడం జరిగింది' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
(ఇది చదవండి: స్విమ్ షూట్‌లో బిగ్ బాస్ బ్యూటీ.. నెటిజన్స్ ట్రోలింగ్!)
Comments
Please login to add a commentAdd a comment