
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించారు. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా మార్చి 17న రిలీజ్ కానుంది. కళ్యాణీ మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కనుల చాటు మేఘమా..’ అంటూ సాగే మొదటి పా టను విడుదల చేశారు మేకర్స్.
ఈ పా టకు లక్ష్మీ భూపా ల సాహిత్యం అందించగా ఆభాస్ జోషి పా డారు. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ– ‘‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కథ అనుకున్నాక కళ్యాణీ మాలిక్‌గారితో ‘ఒక లవ్ స్టోరీ చేస్తున్నాం.. దానికి మంచి పా ట కావాలి’ అన్నాను. ఆయన అద్భుతమైన మెలోడీని స్వరపరిచారు’’ అన్నారు. ‘‘కనుల చాటు మేఘమా..’ పా ట ఇచ్చిన తృప్తి నా 20 ఏళ్ల సినీ జీవితంలో ఏ పా టా ఇవ్వలేదు’’ అన్నారు కళ్యాణీ మాలిక్.
Comments
Please login to add a commentAdd a comment