విజేత వచ్చేశాడు | kalyandev vijetha firstlook release | Sakshi
Sakshi News home page

విజేత వచ్చేశాడు

Published Sun, May 27 2018 12:09 AM | Last Updated on Sun, Sep 2 2018 4:40 PM

kalyandev vijetha firstlook release - Sakshi

కల్యాణ్‌ దేవ్‌

చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ కథానాయకుడిగా రాకేష్‌ శశి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న సినిమా ‘విజేత’. ఇందులో మాళవిక నాయర్‌ కథానాయిక. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను శనివారం విడుదల చేశారు.  సాయి కొర్రపాటి మాట్లాడుతూ–‘‘కల్యాణ్‌దేవ్‌ తొలి సినిమాను ప్రొడ్యూస్‌ చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి చిరంజీవిగారి సూపర్‌ హిట్‌ సినిమాల్లో ఒకటైన ‘విజేత’ టైటిల్‌ను ఆయన అల్లుడు కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి పెట్టడం సంతోషంగా ఉంది. సెంథిల్‌ కుమార్‌ కెమెరా వర్క్‌ ఈ చిత్రానికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌. చిత్రీకరణ తుది దశలో ఉంది. త్వరలోనే టీజర్‌ను రిలీజ్‌ చేసి, జూలైలో సినిమా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’అన్నారు. తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, నాజర్, ‘సత్యం’ రాజేష్, ప్రగతి, కల్యాణి నటరాజన్‌ తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement