కళ్యాణం..కమనీయం... | Naga Shaurya's Kalyana Vaibhogame in Sankrathi rase | Sakshi
Sakshi News home page

కళ్యాణం..కమనీయం...

Published Fri, Nov 27 2015 11:25 PM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

కళ్యాణం..కమనీయం... - Sakshi

కళ్యాణం..కమనీయం...

ప్రేమ, పెళ్లి వంటి బంధాలపై ప్రస్తుతం యువతలో ఎటువంటి అభిప్రాయాలున్నాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై నందినీరెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘ప్రేమ, పెళ్లి విలువలను చాటి చెప్పే కుటుంబ కథా చిత్రమిది. పాటలు బాగా కుదిరాయి.

త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం. ‘అలా మొదలైంది’ తర్వాత నందినీరెడ్డి మా సంస్థలో చేస్తున్న చిత్రం ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్ కోడూరి, కెమెరా: జీవీఎస్ రాజు, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్‌మోహన్ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement