కామెడీ కథా చిత్రంలో మాళవికానాయర్‌ | Malavika Nair act comedy drama film | Sakshi
Sakshi News home page

కామెడీ కథా చిత్రంలో మాళవికానాయర్‌

Mar 27 2017 2:56 AM | Updated on Apr 3 2019 4:04 PM

కామెడీ కథా చిత్రంలో మాళవికానాయర్‌ - Sakshi

కామెడీ కథా చిత్రంలో మాళవికానాయర్‌

కొందరు అవకాశాలను వెతుక్కుంటూ వెళతారు. కొన్ని అవకాశాలు మాత్రం ప్రతిభను వరిస్తాయి.

కొందరు అవకాశాలను వెతుక్కుంటూ వెళతారు. కొన్ని అవకాశాలు మాత్రం ప్రతిభను వరిస్తాయి. అలా నటి మాళవికనాయర్‌ను వెతుక్కుంటూ వచ్చిన చిత్రం అరసియల్ల ఇదెల్లా సహజమప్పా.కేరళకు చెందిన ఈ మలయాళ కుట్టి ఢిల్లీలో చదువుకుంటూ మధ్యమధ్యలో సినిమాల్లో నటిస్తోంది. మాలీవుడ్‌లో ఉస్తాద్‌ హోటల్, కర్మయోగి, పుదియగీతంగళ్‌ చిత్రాల్లో నటించింది.ఆ తరవాత దర్శకుడు రాజుమురుగన్‌ కంటపడింది. అంతే కుక్కూ చిత్రంలో నాయకిగా అంధురాలి పాత్రలో జీవించిందనే చెప్పాలి. ఆ తరువాత ఒకటి రెండు తెలుగు చిత్రాల్లో నటించి మళ్లీ చదువుపై దృష్టి సారించిందట.

ఇక చదువు పూర్తి అయిన తరువాతే నటించాలని నిర్ణయించుకోవడంతో సినిమాలకు చాలా గ్యాప్‌ వచ్చిందని అంటున్న మాళవికనాయర్‌ ఇప్పుడు అరసియల్ల ఇదెల్లా సహజమప్పా అనే రాజకీయ నేపథ్యంలో సాగే వినోద భరిత కథా చిత్రంలో నటించడానికి సిద్ధమైంది.ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను తమిళనాట డిస్ట్రిబ్యూషన్‌ చేసిన ఆరా సినిమాస్‌ సంస్థ అధినేత మహేశ్‌ గోవిందరాజ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా అవినాష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాజతందిరం చిత్రం ఫేమ్‌ వీరా కథానాయకుడిగా నటించనున్న ఇందులో నటి మాళవికానాయర్‌ రాజకీయనాయకుడి కూతురిగా నటించనున్నారని తెలిసింది.ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement