
నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించనున్న తాజా చిత్రానికి ‘నాయనా..! రారా ఇంటికి’ (ఎన్‌ఆర్‌ఐ) అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా తెలుగు అమ్మాయి మహతి భిక్షు కథానాయికగా పరిచయం కానున్నారు. ప్రదీప్ కేఆర్ నిర్మిస్తారు. అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపాల్ బాల రాజశేఖరుని ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, అమల క్లాప్ ఇచ్చారు. అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘బాల రాజశేఖరునిగారు చేసిన ‘బ్లైండ్ యాంబిషన్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. ఆ రకంగా ఆయనే నా ఫస్ట్ íసినిమా గురువు. ఆయనతో పని చేయాలనే ఆకాంక్ష ఇప్పటికి నెరవేరింది. ఈ సినిమాతో నిర్మాత ప్రదీప్‌గారికి మంచి సక్సెస్ వచ్చి, ఆయన మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. ‘సిరివెన్నెల’గారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.
ఆయన మా సినిమాకు పాటలు రాయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మాస్టర్స్ ఇన్ థియేటర్స్‌లో డిగ్రీ చేశాను. దాదాపు 20 ఏళ్లుగా అమెరికాలో ఉన్నాను. నా అనుభవాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను. అక్కినేని ఫ్యామిలీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అమలగారు మా సినిమాకు క్లాప్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. స్విచ్చాన్ చేసిన ఇంద్రగంటి గారికి థ్యాంక్స్. ఆప్తులు, గురువు ‘సిరివెన్నెల’గారు మా సినిమాకు పాటలు రాస్తున్నందుకు సంతోషంగా ఉంది. స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే అవసరాల అయితే బాగుంటుందని అనుకున్నాను. హీరో క్యారెక్టర్ చిలిపిగా ఉంటుంది. నాగబాబు, మంచులక్ష్మి పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి. కేవలం లైన్ మాత్రమే విని సినిమాను నిర్మించడానికి ఒప్పుకున్న నిర్మాత ప్రదీప్‌కు థ్యాంక్స్. ఇదో మంచి రొమాంటిక్ కమ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్’’ అని బాల రాజశేఖరుని అన్నారు. ‘‘బాలరాజశేఖరుని బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ సినిమాతో అతనికి మంచి విజయం అందాలి’’ అన్నారు రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ‘‘మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదటి వారంలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు ప్రదీప్. ఈ చిత్రానికి సంగీతం: యోగేశ్వరశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment