
ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, శుభశ్రీ, శ్రీరామ్, రఘుకుంచే తదితరులు
‘‘చిరంజీవిగారు సాఫ్ట్ పాత్రలో నటించిన ‘రుద్రవీణ’ మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు రౌద్రం నేపథ్యంలో వస్తున్న ‘రుద్రవీణ’ కూడా అంతే పెద్ద సక్సెస్ కావాలి’’ అని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. శ్రీరామ్ నిమ్మల హీరోగా, ఎల్సా, శుభశ్రీ హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుద్రవీణ’. రాగుల గౌరమ్మ సమర్పణలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీను నిర్మించారు.
ఈ సినిమా ప్రీ లుక్‌ని కంచర్ల భూపాల్ రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా విడుదల చేశారు. ‘‘చిన్న సినిమాలను ప్రోత్సహించాలి’’ అన్నారు శ్రీనివాస్ గుప్తా. ‘‘రివెంజ్ డ్రామాతో వస్తున్న చిత్రం ‘రుద్రవీణ’’ అన్నారు మధుసూదన్ రెడ్డి. ‘‘చిరంజీవిగారంటే నాకు సెంటిమెంట్. అందుకే ‘రుద్రవీణ’ టైటిల్ పెట్టాను’’ అన్నారు రాగుల లక్ష్మణ్.
Comments
Please login to add a commentAdd a comment