rudra veena
-
ఒకవైపు యాక్టింగ్..మరోవైపు మ్యూజిక్.. ‘మల్టీ టాలెంటెడ్’గా రఘు కుంచె
రఘు కుంచె ఈ పేరు గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకరింగ్ నుంచి, వెండితెరపై మ్యూజిక్ డైరెక్షన్ దాకా రఘు కుంచె తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకవైపు సినిమాల సంగీతం అందిస్తూనే.. మరోవైపు నటనలోనూ రాణిస్తున్నాడు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటిస్తూ.. ‘మల్టీ టాలెంటెడ్’అని గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘పలాస 1978’ మూవీలో రఘు కుంచె చూపించిన విలనిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. రఘు కుంచె పాత్రకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. విలన్ రోల్ మాత్రం ప్లే చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత రఘు కుంచె మరోసారి తన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించారు. తాజాగా విడుదలైన ‘రుద్రవీణ’లో యానాం రౌడీ ‘లాలప్ప’ పాత్రని పోషించి, మెప్పించాడు. ఇలా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు సంగీత దర్శకుడిగాను రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. అలాగే హీరోగా ఒక చిత్రం కూడా చేయబోతున్నాడని వినికిడి. మొత్తానికి ఒకవైపు నటన మరోవైపు సంగీతంతో రఘు కుంచె కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. -
Rudra Veena Review: ‘రుద్రవీణ మూవీ రివ్యూ
టైటిల్: రుద్రవీణ నటీనటులు: శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ, రఘు కుంచె, గెటప్ శ్రీను, చలాకీ చంటి తదితరులు నిర్మాత : లక్ష్మణ రావు రాగుల దర్శకత్వం: మధుసూదన్ రెడ్డి సంగీతం: మహావీర్ సినిమాటోగ్రఫీ: జి ఎల్ బాబు ఎడిటర్: నాగేశ్వర్ రెడ్డి విడుదల తేది: అక్టోబర్ 28, 2022 ‘రుద్రవీణ’ కథేంటంటే.. లాలప్ప (రఘు కుంచె) యానాం లో పెద్ద రౌడీ. రాజకీయ నాయకులు అండదండలతో యానాంలో అక్రమ వ్యాపారాలు చేస్తుంటాడు. ‘లాలప్ప పన్ను’పేరుతో నగరంలోని చిరు వ్యాపారస్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తుంటారు. ప్రజలకు కూడా లాలప్ప మనుషులు అంటే చాలా భయం. అలాంటి సమయంలో రుద్ర(శ్రీరామ్ నిమ్మల) వరుసగా లాలప్ప మనుషులను హత్య చేస్తుంటాడు. దీంతో లాలప్ప రుద్ర గురించి ఆరా తీస్తాడు. అసలు రుద్ర ఎవరు? ఎందుకు లాలప్ప మనుషులను హత్య చేస్తున్నాడు? వీణ(శుభ శ్రీ)తో రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? ఐపీఎల్‌కు సెలెక్ట్ అయినా రుద్ర.. ఎందుకు జైలుపాలయ్యాడు? హత్యలు చేసేది రుద్రనే అని తెలిసిన తర్వాత ప్రియురాలు ప్రియ(ఎల్సా ఘోష్) ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరకు లాలప్పను రుద్ర ఎలా చంపాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. బాలచందన్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘రుద్రవీణ’ చిత్రం అప్పట్లో ఎంతసూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అలాంటి సూపర్ హిట్ టైటిల్‌తో రావడంతో ‘రుద్రవీణ’పై ఓ మోస్తారు అంచనాలు పెరిగాయి. కానీ ఆ అంచనాలను ఈ ‘రుద్ర వీణ’ అందుకోలేకపోయింది. టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది కానీ.. కథలో అది మిస్ అయింది. కథలో వచ్చే ముఖ్యమైన డైలాగ్స్ విషయంలో కూడా దర్శకుడు జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. ఓ సీన్లో విలన్‌తో ఎమ్మార్వో ‘నీలాంటి వాళ్లను నా సర్వీసులో చాలా మందిని చూశా’అంటాడు.. అప్పుడు విలన్ ‘నా లాంటి వాడిని చూడలేదు’అంటాడు. అక్కడ ‘నన్ను చూడలేదు’ అంటే దానికో అర్థం ఉంటుంది కానీ.. విలన్ కూడా అదే డైలాగ్ చెప్పడం ఏంటో ఎవరికి అర్థం కాదు. అలాగే హీరో కొట్టకముందే విలన్స్ పైకి వెళ్లిపడడం.. పొంతనలేని సీన్స్ ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతాయి. విలన్ మనుషులను హీరో చంపిన తీరు కూడా సాదా సీదాగా ఉంటుంది. హీరోయిన్‌తో లవ్‌ట్రాక్ కాస్త ఎంటర్టైనింగ్ సాగినప్పటికీ.. ఆ సీన్స్ మధ్య మధ్యలో వచ్చిపోతుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇది రీవేంజ్ డ్రామా అని సెకండాఫ్‌లో తెలుస్తుంది. అయితే అక్కడ కూడా కథనం ఆసక్తికరంగా సాగదు. జైలులో మొబైల్ ఫోన్ వాడడం, హత్య చేసినా ఏం జరగనట్లుగా చూపించడం..అంతా సినిమాటిక్‌గా సాగుంతుంది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. రుద్ర పాత్రకి శ్రీరామ్ నిమ్మల న్యాయం చేశాడు. డ్యాన్స్‌తో పాటు ఫైట్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. ఇక విలన్‌గా రఘు కుంచె తనదైన నటనతో మెప్పించాడు. రుద్ర ప్రియురాలు ప్రియగా (ఎల్సా ఘోష్) మెప్పించింది. తెరపై అందంగా కనిపించది. వీణ పాత్రకి శుభశ్రీ న్యాయం చేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
రుద్రవీణ హిట్ కావాలి: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
‘‘చిరంజీవిగారు సాఫ్ట్ పాత్రలో నటించిన ‘రుద్రవీణ’ మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు రౌద్రం నేపథ్యంలో వస్తున్న ‘రుద్రవీణ’ కూడా అంతే పెద్ద సక్సెస్ కావాలి’’ అని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. శ్రీరామ్ నిమ్మల హీరోగా, ఎల్సా, శుభశ్రీ హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుద్రవీణ’. రాగుల గౌరమ్మ సమర్పణలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీను నిర్మించారు. ఈ సినిమా ప్రీ లుక్‌ని కంచర్ల భూపాల్ రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా విడుదల చేశారు. ‘‘చిన్న సినిమాలను ప్రోత్సహించాలి’’ అన్నారు శ్రీనివాస్ గుప్తా. ‘‘రివెంజ్ డ్రామాతో వస్తున్న చిత్రం ‘రుద్రవీణ’’ అన్నారు మధుసూదన్ రెడ్డి. ‘‘చిరంజీవిగారంటే నాకు సెంటిమెంట్. అందుకే ‘రుద్రవీణ’ టైటిల్ పెట్టాను’’ అన్నారు రాగుల లక్ష్మణ్. -
పద్యానవనం: అదంతా గతం
చింతల తోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బాలింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గను వోని బిడ్డకున్ బొంతలు లేవు కప్పుటకు, బొంది హిమంబయి పోవునేమొ, పల్కింతును రుద్రవీణ పయినించుక వెచ్చని అగ్నిగీతముల్. రుద్రవీణ మీద అగ్నిగీతాలు పలికిస్తానంటున్నాడు కవి. ఎంత ప్రగాఢ వ్యక్తీకరణ! పసిపాప ఎలా ఉంది? పసిరెక్కల మొగ్గలాగ.ఎక్కడుంది? తడిసి ముద్దయిన తల్లి ఒడిలో.ఆమె ఎక్కడ? ఇంకా చినుకులు కురుస్తున్న చింత తోపుల్లో.ఏమిటి ఇబ్బంది? కప్పడానికి బొంతలు కూడా లేవు.ఏమవుతుంది? శరీరం మంచులా గడ్డకట్టుకుపోతుందేమోనన్న ఆందోళన.మరి ఏం చేయాలి? అదీ, అందుకోసమే! కనీసం ఉపశమనంగా రుద్రవీణ మీద అగ్నిగీతాలు పలికిస్తానంటున్నాడు మహాకవి దాశరథి. ఉక్కుబంధనాల నుంచి విముక్తమైన తన ప్రాంతం వేగంగా పురోగమించాలనే వాంఛ ఎంత ప్రగాఢమైనదో ‘‘మూర్చన’’లోని ఈ వ్యక్తీకరణల్లో తెలుస్తుంది. తరతరాల బూజు నిజాం రాజు కబంద హస్తాల నుంచి హైదరాబాద్ రాష్ట్రం విముక్తమైనపుడు వేగంగా, శర వేగంగా ఆ ప్రాంతం పురోగమించాలని అభిలషించారాయన. నిజాం వ్యతిరేకపోరాటంలో మాటై, పాటై, బావుటాయై నిలువునా దహించుకుపోయారు. ఒక్కసారిగా లభించిన విముక్తి తర్వాత భవిష్యత్తు కర్తవ్యాన్ని గుర్తుచేసుకుంటున్నట్టుంటుంది ఈ పద్యం. ప్రజ్వలిత అగ్నిజ్వాల కాదు. పసికూన శరీరం కాస్త వెచ్చబెట్టాలి కనుక, ‘ఇంచుక’ వెచ్చని అగ్నిగీతమట పలికించేది. ఎంత సముచిత, సందర్భోచిత పదప్రయోగం! పరుగులిడ నవసరం లేదు, మెల మెల్లగానయినా పథకం ప్రకారం ముందడుగు వేయాలనే సద్యోచన. నిజమే! ఇప్పుడైనా.... పూర్వపు స్థితి నుంచి విడివడి కొత్త రాష్ట్రంగా ఏర్పడుతున్న ప్రాంతమేదైనా, కొత్త చిగుళ్లు తొడిగి ఎదగాలి. అందుకు అందరి చేయూత, తోడ్పాటూ అవసరం. అన్నీ అమరిన ఇంట్లోలాగా చింతల తోపుల్లో బొంతలుండవు. ఉలన్ దుప్పట్లు అసలే ఉండవు. వారి సహాయమో, వీరి సహాయమో ఒక్కొక్కటి సమకూర్చుకోవాల్సిందే, సందేహము లేదు. ఏదో చేయాలన్న తపన, ఆర్థి ముఖ్యం. ముఖ్యంగా పాలకులకు. అనేకానేక కారణాల వల్ల కుంటువడిపోయిన ప్రగతి, నిలిచి పోయిన సంక్షేమం, నీరసించిన పాలనలో... నిస్తేజమైన జనజీవన గమనాన్ని మెలమెల్లగా నడిపించాలి, ఆపై పరుగులెత్తించాలి. అభ్యుదయం బాటన సాగించాలి. యోచనాపరులు బాధ్యత తీసుకొని ముందుకు రావాలి. నిబద్దత కలిగిన నాయకత్వం కొత్త దీక్ష తీసుకొని దార్శనికత కనబరచాలి. ఓ గొప్ప‘రోడ్ మ్యాప్’ గీసుకొని పథకం ప్రకారం, ప్రణాళికా బద్దంగా ముందుకు నడిపితే తప్ప గమ్యం చేరం, లక్ష్యం నెరవేరదు. ప్రతి ఆలోచనా, ఆచరణా భవిష్యత్తుపై విశ్వాసం, అంతకు మించి భరోసా కలిగించాలి. అలా చేయకుంటే జాతి క్షమించదు! విముక్తి లభించగానే రుద్రవీణ అందుకున్న ఇదే దాశరథి తనప్రాంతాన్ని ఓ వీణతో పోల్చి ఉద్యమానికి ఊపిరులూదారు. ‘‘ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మా కెన్నడేని, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ’’ అంటూ పరితపించాడు, తగిన శాస్తి జరుగుతుందని నిజామును శపించాడు. గతం తెలియని వాడు కాదు. కానీ, పోరాట శక్తులకు సైనిక చర్యతోడై నిజాం పీచమణిచినపుడు, విముక్తిని నిండు హృదయంతో స్వాగతించాడు. అంతే తప్ప, అదే గతాన్ని ముందేసుకొని చింతతోనో, ప్రతీకార చింతనతోనో రగిలిపోలేదు. ఆశావహ దృక్పథంతో భవిష్యత్తు వైపు అడుగులు వేశాడు. మావో-సే-టుంగ్ గేయమొకటి తర్జుమా చేస్తూ, ఆయనే చెప్పిన ఒక పంక్తి ఇక్కడ ప్రస్తావనార్హం. ‘‘అదంతా గతం నేటితో అది ఖతం’’. - దిలీప్‌రెడ్డి