రఘు కుంచె ఈ పేరు గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకరింగ్ నుంచి, వెండితెరపై మ్యూజిక్ డైరెక్షన్ దాకా రఘు కుంచె తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకవైపు సినిమాల సంగీతం అందిస్తూనే.. మరోవైపు నటనలోనూ రాణిస్తున్నాడు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటిస్తూ.. ‘మల్టీ టాలెంటెడ్’అని గుర్తింపు సంపాదించుకున్నాడు.
‘పలాస 1978’ మూవీలో రఘు కుంచె చూపించిన విలనిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. రఘు కుంచె పాత్రకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. విలన్ రోల్ మాత్రం ప్లే చేయలేదు.
చాలా గ్యాప్ తర్వాత రఘు కుంచె మరోసారి తన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించారు. తాజాగా విడుదలైన ‘రుద్రవీణ’లో యానాం రౌడీ ‘లాలప్ప’ పాత్రని పోషించి, మెప్పించాడు. ఇలా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు సంగీత దర్శకుడిగాను రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. అలాగే హీరోగా ఒక చిత్రం కూడా చేయబోతున్నాడని వినికిడి. మొత్తానికి ఒకవైపు నటన మరోవైపు సంగీతంతో రఘు కుంచె కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment