
సాక్షి, తూర్పుగోదావరి (మధురపూడి): తెలుగు సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె తండ్రి లక్ష్మీనారాయణరావు (90) మంగళవారం మరణించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన కుంచె లక్ష్మీనారాయణరావు 1933లో జన్మించారు.
ఆయనకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మీనారాయణరావు అంత్యక్రియలు బుధవారం స్వగ్రామంలో నిర్వహిస్తారు. జీవనోపాధి కోసం వ్యవసాయం చేసిన లక్ష్మీనారాయణరావు స్థానిక సాగునీటి సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. హోమియో వైద్యుడిగా సేవలందించారు.
చదవండి: (Tamannaah: రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోయిన్ల కంటే హీరోలకే వణుకు)
Comments
Please login to add a commentAdd a comment