Bhupal Reddy
-
నల్లగొండ మున్సిపాలిటి వద్ద ఉద్రిక్తత
నల్లగొండ: నల్లగొండ మున్సిపాలిటి(nalgonda municipality) వద్ద బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకులు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్తా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్లో బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కార్యకర్తలు బైఠాయించడంతో.. కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మున్సిపల్ కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌ెడ్డి మండిపడ్డారు.అదే క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లేందుకు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. అయితే దీన్ని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడ్నుంచి తరలించారు.అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతాం..నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై కాంగ్రెస్(Congress) నేతలు మండిపడుతున్నారు. అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వ్యతిరేకంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రస్తకే లేదన్నారు. ‘పోలీసులపై కంచర్ల భూపాల్ రెడ్డి దుర్భాషలాడారు. కంచర్ల భూపాల్ రెడ్డి పదేపదే అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని రోజులు ఓపిక పట్టాం ఇకపై ఉరికిచ్చి కొడతాం.కంచర్ల భూపాల్ రెడ్డి ఒక మెంటల్ కృష్ణ’అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు.రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఎంపీ ఈటల, అనుచరుల దాడితెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దాడి చేశారు. పేదల భూములు కబ్జా చేశారనే ఆరోపణల నేపథ్యంలో రియల్ వ్యాపారిపై ఈటల చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.పేదలను భూములను కబ్జా చేస్తున్నారని బాధితులు ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈటల నేడు.. మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో ఉన్న ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పేదల భూములను రియల్ వ్యాపారులు ఆక్రమించుకోవడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
వెండితెరపై మన నాయకులు
‘మడిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలా..’ అని ఓ తెలుగు సినిమాలో సినీనటుడు రావుగోపాలరావు చెప్పినట్లు.. ఉమ్మడి జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు వెండితెరపై తళుక్కున మెరిసి తమలోని కళానైపుణ్యాన్ని చాటుకున్నారు. మోత్కుపల్లి నర్సింహులు, కంచర్ల భూపాల్‌రెడ్డి నిజ జీవితంలో మాదిరిగానే సినిమాల్లో కూడా ప్రజాప్రతినిధులుగా.. అద్దంకి దయాకర్ లీడర్‌గా పాత్రలు పోషించి తమ నటనాకౌశలంతో ప్రేక్షకులను మెప్పించారు. వెండితెరపై కనిపించిన మన నాయకులపై ప్రత్యేక కథనం..సినిమాల్లోనూ లీడర్, ప్రజాప్రతినిధులుగా నటించిన అద్దంకి దయాకర్, మోత్కుపల్లి నర్సింహులు, కంచర్ల భూపాల్రెడ్డితమ నటనాకౌశలంతో ప్రేక్షకులను మెప్పించిన నేతలుఅర్వపల్లి: సమకాలీన రాజకీయ అంశాలు, యథార్థ సంఘటనలు, ప్రేక్షకుల్లో సామాజిక, రాజకీయ చైతన్యం కలిగించేలా బొమ్మకు మురళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇండియా ఫైల్స్ చిత్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్చార్జ్, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామానికి చెందిన అద్దంకి దయాకర్ స్వీయ పాత్రలో నటిస్తున్నారు. నటి ఇంద్రజ కూడా ఇందులో నటిస్తోంది. భారతదేశంతో పాటు మొత్తం నాలుగు దేశాలకు సంబంధించిన భాషల్లో ఈ సినిమాను తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో రిలీజ్ కాగా డిసెంబర్లో సినిమా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రజాగాయకుడు గద్దర్ చివరిసారిగా నటించడంతో పాటు ఆయన చివరి పాట కూడా ఉంది. ఇండియాకు సంబంధించిన 10వేల సంవత్సరాల చరిత్రను క్లుప్తంగా ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 90శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఎమ్మెల్యేగా నటించి.. నల్లగొండ: నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నల్లగొండకు చెందిన చిన్ని చరణ్ దర్శకత్వం వహించిన అదీ లెక్క సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో నటించారు. ఈ సినిమా 2016లో విడుదలయ్యింది. ఈ సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో నటించిన భూపాల్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం విశేషం.సినీ నిర్మాతగా యుగంధర్‌రావు తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సూర్యాపేట జెడ్పీ మాజీ చైర్పర్సన్ గుజ్జ దీపిక భర్త గుజ్జ యుగంధర్‌రావు బందూక్ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా 2015 జూన్ 19న విడుదలయ్యింది. -
ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎంవీ భూపాల్‌రెడ్డితో పాటు కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న మదన్‌మోహన్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బాలాపూర్ మండలం గుర్రంగూడకు చెందిన జక్కిడి ముత్యంరెడ్డికి 14 గుంటల పట్టా భూమి ఉంది. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి దీన్ని తొలగించాలని కోరుతూ ఆయన ఇటీవల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ను కలిసి అనేకసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఇ–సెక్షన్లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డిని సంప్రదించారు. విషయం అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఆయన రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, రూ.8 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో అధికారులు స్కెచ్చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మదన్‌మోహన్‌రెడ్డిని గుర్రంగూడ ఎక్స్‌రోడ్‌కు ముత్యంరెడ్డి పిలిపించాడు. మాటు వేసి.. సీనియర్ అసిస్టెంట్ తన స్విఫ్ట్ డిజైర్ టీఎస్ 08ఎఫ్ఆర్ 1134 కారులో అక్కడికి చేరుకోగా ముత్యంరెడ్డి రూ.8 లక్షల నగదుతో కూడిన సంచిని అందజేశాడు. అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు మదన్‌మోహన్‌రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే అతను అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకే తాను డబ్బులు తీసుకున్నట్లు చెప్పడంతో అతనితో భూపాల్‌రెడ్డికి ఫోన్ చేయించారు. నగదు తీసుకుని ఓఆర్ఆర్ పెద్ద అంబర్పేట్ ఎగ్జిట్ వద్దకు రావాలని భూపాల్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఇన్నోవా కారు (టీఎస్ 07జీకే0459)లో రాత్రి 10.41 గంటలకు పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్ వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న మదన్మోహన్ తన కారులో ఉన్న నగదును భూపాల్‌రెడ్డి వాహనంలో పెట్టారు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు భూపాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్‌కు తీసుకొచ్చి విచారించారు. తెల్లారేవరకు అక్కడే ఉంచారు. కీలక ఫైళ్లను స్వా«దీనం చేసుకున్నారు. రూ.16 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాదీనం హయత్‌నగర్ పరిధిలోని తట్టిఅన్నారం వద్ద ఇందు అరణ్య విల్లాస్‌లో ఉంటున్న భూపాల్‌రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. రూ.16 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం మదన్‌మోహన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డిలను ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఐదుగురిని పట్టించిన ముత్యంరెడ్డిగుర్రంగూడకు చెందిన జక్కిడి ముత్యంరెడ్డి గతంలో తుర్కయాంజాల్‌కు చెందిన ఓ వీఆర్వో, మున్సిపల్ పరిధిలోని బిల్ కలెక్టర్‌తో పాటు ఓ ఎస్ఐని కూడా వివిధ కేసుల్లో ఏసీబీకి పట్టించడం గమనార్హం. కాగా ఇప్పుడు ఏకంగా ఓ అదనపు కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్‌ను కూడా పట్టించారు. -
ఏసీబీ వలలో చిక్కిన అవినీతి అధికారులు అరెస్ట్
-
నల్గొండ నియోజకవర్గం తదుపరి అభ్యర్థి..?
నల్గొండ నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన కంచర్ల భూపాల్ రెడ్డి సంచలన విజయం సాదించారు. నల్గొండలో స్ట్రాంగ్ మాన్‌గా పేరొందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆయన 23698 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. 1999 నుంచి ఇక్కడ నుంచి వరసగా గెలుస్తున్న కోమటిరెడ్డి 2018లో ఓటమి చెందారు. భూపాల్ రెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయి, 2018లో టిఆర్ఎస్లో చేరి గెలుపొందారు. భూపాల్ రెడ్డికి 98792 ఓట్లు రాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 75094 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మూడోస్థానం స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన వెంకటేశ్వర్లుకు వచ్చింది. ఆయనకు సుమారు మూడువేల ఓట్లు వచ్చాయి. భూపాల్ రెడ్డి సామాజికంగా రెడ్డి వర్గం నేత. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2019లో లోక్ సభ ఎన్నికలలో భువనగిరి నుంచి పోటీచేసి గెలుపొందడం విశేషం. నల్గొండ పట్టణంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు సార్లు గెలిచారు. 2014లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభకు ఎన్నికైనా ఆయన సోదరుడు రాజగోపాలరెడ్డి భువనగిరి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 2018లో వెంకటరెడ్డి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయి, తదుపరి 2019లో ఎమ్.పిగా గెలిస్తే, రాజగోపాలరెడ్డి మునుగోడు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజగోపాలరెడ్డి ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా కూడా గెలిచారు. ఇద్దరు సీనియర్లు జానారెడ్డి, దామోదరరెడ్డిలను కాదని వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2009లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం విశేషం. వైఎస్ మరణం తర్వాత రోశయ్య క్యాబినెట్లో ఉన్నారు. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో కొనసాగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. నల్గొండలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడు సార్లు, టిడిపి మూడుసార్లు, పిడిఎఫ్ రెండుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, అవిభక్త సిపిఐ ఒకసారి సిపిఎం ఒకసారి గెలుపొందగా, ఇండిపెండెంటు ఒకరు గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 1985లో ఉమ్మడి రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి పోటీ చేశారు. హిందుపూర్, గుడివాడలతో పాటు, నల్గొండ నుంచి పోటీచేసి విజయం సాధించారు. మూడుచోట్ల ఒకేసారి గెలవడం ఒక రికార్డు. కాంగ్రెస్ నాయకుడు చకిలం శ్రీనివాసరావు నల్గొండలో రెండుసార్లు, మిర్యాలగూడలో ఒకసారి గెలిచారు. ఒకసారి ఆయన లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. 1962లో ఇక్కడ గెలిచిన సిపిఐ నేత ధర్మభిక్షం 1952లో సూర్యాపేటలో, 1957లో నకిరేకల్‌లో గెలిచారు. ఈయన నల్గొండ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకసారి ఇక్కడ గెలిచిన రఘుమారెడ్డి ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా 2004లో టిడిపి పక్షాన ఇక్కడ శాసనసభకు పోటీచేసి ఓడిపోయిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, 1999లో టిడిపి పక్షాన, 2009,2014లలో కాంగ్రెస్ ఐ పక్షాన లోక్‌సభకు ఎన్నికయ్యారు. తదుపరి కాలంలో ఆయన టిఆర్ఎస్లో చేరిపోయి ఎమ్మెల్సీ అయి కౌన్సిల్ చైర్మన్ అయ్యారు. రైతు సమన్వయ సమితి అద్యక్షుడుగా కూడా వ్యవహరించారు. నల్గొండలో 12 సార్లు రెడ్లు, రెండుసార్లు బ్రాహ్మణ, ఒకసారి గౌడ్, ఒకసారి ఎస్.సి, ఒకసారి కమ్మ సామాజికవర్గాలు ఎన్నికయ్యాయి. నల్గొండ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
వచ్చే ఎన్నికల్లో నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది..!
నారాయణ ఖేడ్ నియోజకవర్గం నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్.భూపాల్ రెడ్డి రెండోసారి విజయం సాదించారు.2014 ఎన్నికలలో ఇక్కడ గెలిచిన పి.కిష్టారెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి భూపాల్ రెడ్డి గెలుపొందారు. తిరిగి 2018 ఎన్నికలలో తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ ఎమ్.పి సురేష్ షెట్కార్‌పై 58508 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భూపాల్ రెడ్డికి 95550 ఓట్లు రాగా, సురేష్ షెట్కార్ కు 37042 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ బిజెపి అభ్యర్ధిగా పి. సంజీవరెడ్డికి కాంగ్రెస్ ఐ అభ్యర్దితో దాదాపు సమానంగా 36వేలకు పైగా ఓట్లు లభించాయి. ఆయన మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు కావడం వల్ల ఓట్లు గణనీయగా వచ్చాయి.కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడంతో బిజెపి పక్షాన పోటీచేశారు.రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి భూపాల్ రెడ్డి. 2014లో తెలంగాణలో టిఆర్ఎస్ గాలిని ఎదుర్కుని గెలిచిన కాంగ్రెస్ ఐ నేతలలో నారాయణ ఖేడ్ సిటింగ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఒకరు. ఈయన టిఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్.భూపాల రెడ్డిని 14786 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. 2014లో తెలుగుదేశం - బిజెపి కూటమి అభ్యర్ధిగా రంగంలో దిగిన మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డికి 40405 ఓట్లు వచ్చాయి. నాలుగోసారి శాసనసభకు ఎన్నికైన కిష్టారెడ్డి దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత బాగారెడ్డికి దగ్గర బంధువు అవుతారు. కిష్టారెడ్డి ఆ తర్వాత మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచెంది. నారాయణ ఖేడ్, అంతకుముందు సదాశివపేటలలో కలిపి ఏడుసార్లు రెడ్లు ఎన్నికైతే, ఏడుసార్లు షెట్కార్‌లు గెలుపొందారు. ఒకసారి ఎస్.సికి అవకాశం వచ్చింది. నారాయణ ఖేడ్‌లో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి పదిసార్లు గెలవగా, టిడిపి రెండుసార్లు, స్వతంత్రపార్టీ ఒకసారి గెలుపొందాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. రెండుసార్లు టిఆర్ఎస్ గెలిచింది. 1972, 1983లో ఇక్కడ రెండుసార్లు గెలిచిన వెంకటరెడ్డి, 1994లో గెలిచిన విజయపాల్‌రెడ్డి తండ్రీ కొడుకులు. నారాయణఖేడ్‌లో రెండు సార్లు గెలిచిన అప్పారావు షేట్కర్, మూడుసార్లు నెగ్గిన శివరావుషేట్కర్, ఒకసారి గెలిచిన సురేష్‌కుమార్ షేట్కర్లు ఒకే కుటుంబానికి చెందినవారు.2009లో సురేష్ షెట్కార్ జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఒకసారి గెలుపొందారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
సంగారెడ్డి నేతలకు సీఎం కేసీఆర్ పదవుల పందేరం.. వ్యూహాత్మకమా?
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వ కార్పొరేషన్లకు చైర్మ న్లుగా నియమిస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డిని తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమించారు. సంస్థ డెరెక్టర్లుగా హైదరా బాద్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్, నారాయణ్ పేట్ జిల్లా మద్దూర్ మండలం రెనెవట్లకు చెందిన మొహమ్మద్ సలీం నియమితులయ్యారు. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమో షన్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా అందోలు ని యోజకవర్గం వట్పల్లి మండలం మార్వెల్లి కి చెందిన మఠం భిక్షపతి స్వామిని నియమించారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మొహమ్మద్ తన్వీర్‌ను తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మ న్గా నియమిస్తున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే.. ♦ వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు నేతలకు ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా నియమించారు. పటాన్చెరుకి చెందిన మాజీ ఎమ్మెల్సీ వి.భూ పాల్‌రెడ్డి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. 2007 నుంచి 2022 మధ్యకాలంలో వరుసగా మూడు పర్యా యాలు మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన 2021 జూన్ 4 నుంచి 2022 జనవరి 3 వరకు శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ♦ అందోలు నియోజకవర్గం వట్‌పల్లికి చెందిన మఠం భిక్షపతి స్వామి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతిలో క్రియాశీలంగా పనిచేశారు. సంగారెడ్డి జిల్లాలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న లింగాయత్ కోటాలో భిక్షపతికి కార్పొరేషన్ పదవి దక్కింది. ♦ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కుమారుడు తన్వీర్‌కు స్థానిక ఉన్న సామాజికవర్గం లెక్కలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ పదవి అప్పగించారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం బీఆర్ఎస్లో చేరగా.. ఎమ్మెల్సీ పదవి అప్పగించారు. పదవీకాలం పూర్తయిన తర్వాత అనారోగ్యంతో ఫరీదుద్దీన్ మరణించడంతో ఇటీవల ఆయన కుమారుడు తన్వీర్‌ను మైనారిటీ కమిషన్ సభ్యుడిగా నియమించగా, తాజాగా టీఎస్ఐడీసీ చైర్మన్ పదవి అప్పగించారు. -
అక్కడి బీఆర్ఎస్లో వర్గపోరు.. మన్నెంకు టికెట్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీఆర్ఎస్ పార్టీలో అంసతృప్తి నాయకులు పెరుగుతున్నారు. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇటీవల చకిలం అనిల్‌కుమార్ పార్టీని వీడగా.. ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన మందుల సామేలు రాజీనామా చేశారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఓ జెడ్పీటీసీ, మరికొంత మంది నాయకులు కూడా పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. మరికొందరు అంతర్గతంగా తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ల కోసం పోటీ పెరుగుతోంది. ఇటు అంసతృప్తులు అటు ఆశావహులతో బీఆర్ఎస్ అధిష్టానం ఉక్కిరిబిక్కరి అవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో కీలకగా పనిచేసిన నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వారిలో కొందరికి కార్పొరేషన్ తదితర పదవులను ఇచ్చి సంతృప్తి పరిచినా మరికొందరు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశతోనే ఉన్నారు. అలా మందుల సామేలు లాంటి కొందరు పార్టీని వీడుతున్నారు. కొందరు సీఎం కేసీఆర్‌పై భారం వేసి, ఎదురుచూస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో విధంగా.. నల్లగొండ నియోజకవర్గానికి చెందిన చకిలం అనిల్‌కుమార్ తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో ఉన్నారు. తెలంగాణ రాకముందు ఆయ న నల్లగొండ నుంచి పోటీ చేయాలనుకున్నారు. 2009లో పొత్తుల్లో భాగంగా టికెట్ కాంగ్రెస్‌కు పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన దుబ్బాక నర్సింహారెడ్డికి టికెట్ ఇచ్చారు. రెండోసారి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కంచర్ల భూపాల్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో చకిలంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం హామీ ఇచ్చినా నెరవేరలేదు. దీంతో ఆయన ఇటీవల తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు నియోజక వర్గంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఉద్యమంలో పాల్గొన్న చాడ కిషన్‌రెడ్డి ప్రతిసారి అడుగుతున్నా ఇవ్వడం లేదు. మరోవైపు పిల్లి రామరాజు సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ► కోదాడ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కన్నంతరెడ్డి శశిధర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ వస్తుందనుకున్నా చివరి నిమిషంలో తెలుగుదేశం నుంచి వచ్చిన బొల్లం మల్లయ్యయాదవ్‌కు టికెట్ దక్కింది. ఆతర్వాత శశిధర్‌రెడ్డికి ఎలాంటి పదవులూ దక్కలేదు. ఈసారి ఆయన టికె ట్ కచ్చితంగా వస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ టికెట్ ఆశిస్తున్న వారిలో ఎన్ఆర్ఐ జలగం సుధీర్ కూడా ఉన్నారు. ► నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మె ల్యే నోముల భగత్‌కు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈసారి ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా మరొకరు సహకరించే పరిస్థితి లేదు. మరోవైపు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి, మన్నెం రంజిత్‌యాదవ్, కట్టెబోయిన గురువయ్య యాదవ్ ఉన్నారు. ► దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వర్గీయుల మధ్య అభిప్రాయభేదాలు కొనసాగుతున్నాయి. బయటి విమర్శలు చేసుకోకపోయినా అవి అంతర్గంగా కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ► నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఎమ్మెల్యే లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఎరికివారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిట్టింగులకే ఈసారి టికెట్ ఇస్తామని కేసీఆర్ చెప్పడంతో.. టికెట్ రాకపోతే వీరేశం పార్టీ నుంచి వెళ్లిపోతాడన్న చర్చ సాగుతోంది. ► మునుగోడు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. చాలా సందర్భాల్లో అవి బయటపడ్డాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికితోపాటు మాజీ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్, గుత్తా అమిత్‌రెడ్డి, నారబోయిన రవి, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. ► తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన మందుల సామేలు కూడా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో గాదరి కిషోర్‌కుమార్‌కు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. సామేలుకు కార్పొరేషన్ పదవి ఇచ్చినా, ఎమ్మెల్యే కావాలన్న కోరికతో టికెట్ అడుతున్నారు. తిరుమలగిరిలో గురువారం జరిగిన ప్రగతి నివేదన సభలో కిషోర్‌ను మూడోసారి గెలిపించాలని కేటీఆర్ ప్రకటించడతో తనకు ఇక టికెట్ రాదని భావించి సామేలు బీఆర్ఎస్కు రాజీనామ చేశారు. ► సూర్యాపేటలో పార్టీ శ్రేణులంతా మంత్రి జగదీ‹శ్రెడ్డికే మద్దతు పలుకుతున్నారు. టికెట్ ఆశించేవారు ఎవరూ లేరు. హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే సైదిరెడ్డిపై అసంతృప్తి ఉన్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించేవారు పెద్దగాలేరు. ఆలేరు నియోజకవర్గంలోని అదే పరిస్థితి ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యేకు టికెట్ వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ బీఆర్ఎస్లో చేరారు. అధిష్టానం ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది తేలాల్సి ఉంది. భువనగిరి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కాదని, టికెట్ ఆశించేవారు ఇప్పటివరకు బయటకు రాలేదు. -
ఎమ్మెల్యేకు పోయే కాలం దగ్గరపడింది: కోమటిరెడ్డి ఫైర్
సాక్షి, నల్లగొండ: నల్లగొండలో నేను చేసిన అభివృద్ధే కనిపిస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని ఆయన క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాదరి మారయ్య పుణ్యామని నల్లగొండ రోడ్లు బాగుపడుతున్నాయి. రూ.వంద కోట్లు తెచ్చి అక్కడక్కడా కుక్కల బొమ్మలు, గాడ్దుల బొమ్మలు పెట్టి అభివృద్ధి అంటున్నారు. పట్టణంలో రోడ్ల వెడల్పులో ఇళ్ల కూలగొట్టారు, రేపు పండ్ల బండ్లవాళ్లనీ అక్కడ ఉండనివ్వరు.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి పోయేకాలం దగ్గర పడిందని అన్నారు. రూ.వంద కోట్లు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి పెట్టిన అది పూర్తి చేస్తే పాత బస్తీలో వాసన పోయేదని పేర్కొన్నారు. నల్లగొండలో మీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారని ఒక విలేకరి ప్రశ్నించగా అభివృద్ధి చేయలేదని అంటే ప్రజలు చెప్పుతో కొడతారన్నారు. ఆనాడు వైఎస్ సహకారంతో కేంద్రాన్ని ఒప్పించి రైల్వే ప్లైఓవల్ నిర్మించాను. దాని విలువ ఇప్పుడు రూ.270 కోట్లు, సొరంగమార్గం, బ్రాహ్మణవెల్లంల, ఉదయసముద్రం ప్రాజెక్టు, పట్టణంలో రోడ్లు, మహాత్మాగాంధీ యునివర్సిటీ అన్నీ నేను మంజూరు చేయించినవేనని, అవి వారికి కనిపించడం లేదని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీబీనగర్ ఎయిమ్స్ కూడా అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. నకిరేకల్ నుంచి పానగల్ రోడ్డు విస్తరణ ఆనాడు ఇద్దరు ఎంపీలైన గుత్తా, బూర నర్సయ్య ఉండి ఏమి చేయలేదు.. నేను ఎంపీ అయిన తర్వాతే మంజూరు చేయించానన్నారు. నడి సెంటర్లో రూ.వంద కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిలో బుద్ధి ఉన్న వాళ్లు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ భవనం కట్టుకుంటారా అని ప్రశ్నించారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ దాన్ని తీసి వేసి ఆ స్థలంలో పేదలకు, జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, లేదా హాస్టళ్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. -
రుద్రవీణ హిట్ కావాలి: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
‘‘చిరంజీవిగారు సాఫ్ట్ పాత్రలో నటించిన ‘రుద్రవీణ’ మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు రౌద్రం నేపథ్యంలో వస్తున్న ‘రుద్రవీణ’ కూడా అంతే పెద్ద సక్సెస్ కావాలి’’ అని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. శ్రీరామ్ నిమ్మల హీరోగా, ఎల్సా, శుభశ్రీ హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుద్రవీణ’. రాగుల గౌరమ్మ సమర్పణలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీను నిర్మించారు. ఈ సినిమా ప్రీ లుక్‌ని కంచర్ల భూపాల్ రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా విడుదల చేశారు. ‘‘చిన్న సినిమాలను ప్రోత్సహించాలి’’ అన్నారు శ్రీనివాస్ గుప్తా. ‘‘రివెంజ్ డ్రామాతో వస్తున్న చిత్రం ‘రుద్రవీణ’’ అన్నారు మధుసూదన్ రెడ్డి. ‘‘చిరంజీవిగారంటే నాకు సెంటిమెంట్. అందుకే ‘రుద్రవీణ’ టైటిల్ పెట్టాను’’ అన్నారు రాగుల లక్ష్మణ్. -
మండలి ప్రొటెమ్ చైర్మన్‌కు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో మెదక్ ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తి చేసుకున్న శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ వి.భూపాల్‌రెడ్డికి మంగళవారం వీడ్కోలు పలికారు. శాసనమండలి చైర్మన్ చాంబర్లో భూపాల్‌రెడ్డిని ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, తేరా చిన్నపరెడ్డి సన్మానించారు. అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు, మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి తదితరులు భూపాల్‌రెడ్డికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. కాగా, ప్రొటెమ్ చైర్మన్ భూపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా కాలపరిమితి పూర్తి చేసు కోవడంతో ఆయన స్థానంలో మండలిలో సీనియర్ సభ్యుడిని ప్రొటెమ్ చైర్మన్‌గా నియమించనున్నారు. నూతన ప్రొటెమ్ చైర్మన్‌గా రాజేశ్వర్ పేరు ఖరారైనట్లు సమాచారం. అయితే ఆయన్ను నామినేట్ చేయడానికి సంబంధించి మంగళవారం రాత్రి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. -
చుక్కా రామయ్యకు ప్రొటెమ్ చైర్మన్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యుడు చుక్కా రామయ్యను శాసనమండలి ప్రొటెమ్ చైర్మన్ భూపాల్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. మాజీ ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డితో కలిసి విద్యానగర్‌లోని రామయ్య నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో తన సొంత నిధులతో నిర్మించిన గీతాభూపాల్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించాల్సిందిగా భూపాల్‌రెడ్డి కోరారు. నేటితరం విద్యార్థులకు రామయ్య వంటి విద్యావేత్త మార్గదర్శనం అవసరముందని వ్యాఖ్యానించారు. -
2023లోనూ టీఆర్ఎస్దే విజయం: ఎమ్మెల్సీగా పల్లా ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి గురువారం పల్లాతో ప్రమాణ స్వీకారం చేయించారు. మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత ఉత్కంఠ రేపిన ఎన్నికల ఫలితాల్లో చివరకు పల్లా విజయం సాధించారు. ప్రమాణం అనంతరం రాజేశ్వర్‌రెడ్డిని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మార్చిలో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భారతదేశ చరిత్రలో 72 మంది పోటీ చేయగా రికార్డు మెజారిటీతో పట్టభద్రులు తనను గెలిపించారని తెలిపారు. 10 లక్షల మంది ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచిన చరిత్ర సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. 2023లో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో నేరాలు తగ్గాయని చెప్పారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన సంఘటన దురదృష్టకరమని తెలిపారు. దుర్మార్గుడు రాజు తనకు తాను శిక్ష విధించుకున్నాడని, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదదని స్పష్టం చేశారు. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం -
డిగ్రీ పరీక్ష రాసిన ఎమ్మెల్యే
నల్లగొండ: నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్ష రాశారు. నల్లగొండ పట్టణంలోని నాగార్జున కళాశాలలో సోమవారం జరిగిన బీఏ మొదటి సెమిస్టర్ పరీక్షకు ఆయన హాజరయ్యారు. ఈ నెల 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. -
Nalgonda: మానవత్వం చాటిన ఎమ్మెల్యే కంచర్ల
నల్లగొండ క్రైం : ఆ కుటుంబాన్ని కరోనా ఇంటికే పరిమితం చేసింది. మహమ్మారి బారిన పడి ఆ కుటుంబంలో ఓ వృద్ధురాలు మృతిచెందింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబానికి నల్లగొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అండగా నిలిచారు. మృతిచెందిన వృద్ధురాలికి అంత్యక్రియలు దగ్గరుండి ఆయనే చేయించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నల్లగొండలోని పాతబస్తీ వంటిస్తంభం ప్రాంతానికి చెందిన పూజారి కుటుంబానికి చెందిన కాంచనపల్లి భారతమ్మ (70) కరోనాతో మృతి చెందింది. మనుమరాలు సుమలత, ఆమె భర్త బొల్లోజు దుర్గాప్రసాద్, కుమారుడు మహేశ్‌కు ఈనెల 3వ తేదీన కరోనా పాజిటివ్ రావడంతో ఇంటికే పరిమితమయ్యారు. గురువారం వృద్ధురాలు భారతమ్మను స్థానిక కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాస్ అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా తానుండలేనంటూ భయానికే ఇంటికి తిరిగి వచ్చి శుక్రవారం ఉదయం మరణించింది. కరోనాతో భయంతో ఉన్న కుటుంబానికి అంత్యక్రియలు చేయడం మరింత క్లిష్టంగా మారింది. దీంతో కౌన్సిలర్ శ్రీను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వృద్ధురాలికి హిందూపూర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేయించారు. వృద్ధురాలి కుటుంబ సభ్యులు కరోనాతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేమని చెప్పడంతో ఎమ్మెల్యే అంతా తానై అంత్యక్రియలు పూర్తి చేశారు. అవసరమైన మందులు , నిత్యావసర సరుకులను అందిస్తామని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. -
రెండేళ్ల పదవీ కాలం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మనోగతం
‘స్వరాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందాలనేదే.. టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఆ ప్రాతిపదికనే పార్టీ ఆవిర్భవించి ప్రజల ఆశీర్వాదంతో మరోమారు అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే.. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. విపక్షాలు ఎన్ని విమర్శలు.. ఆరోపణలు చేసినా ఇది కఠోర వాస్తవం. మాటతప్పి..మడమ తిప్పే నైజం మాది కాదు. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో మూడేళ్లలో అన్నింటినీ నెరవేరుస్తాం. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లా దశదిశ మార్చి మళ్లీ దీవించాలని కోరుతాం.’ ఇదీ.. రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ ఎదుట ఆవిష్కరించిన ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మనోగతం. సాక్షి, సూర్యాపేట: ఏళ్ల తరబడి బీడుగా ఉన్న భూములు సస్యశ్యామలం అయ్యాయి. ఎన్నో ఏళ్ల కింద తీసిన కాల్వల్లో ఇక నీళ్లు రావని ఆయకట్టు రైతులు భావించారు. కానీ ఈ కాల్వల్లో గోదావరి జలాలు పారించి రైతు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది మా ప్రభుత్వం. మూసీ, గోదావరి, కృష్ణా జలాలతో జిల్లాలో రికార్డు స్థాయిలో పంటలు పండాయి. ఎక్కడ చూసినా పచ్చదనమే.. జిల్లాకు గోదావరి జలాల రాకతో ఆయకట్టులో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. మా ప్రభుత్వం వచ్చాక రైతుల కళ్లల్లో ఆనందం చూడాలనుకుంది. గోదావరి జలాలను ఈ కాలువలకు మళ్లించి రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాం. గతేడాది నుంచి పంట పూర్తిగా చేతికి వచ్చే వరకు జిల్లాలోని ఆయకట్టుకు గోదావరి నీళ్లు అందిస్తూ వస్తున్నాం. ఇలా పూర్తి స్థాయిలో పంటకు గోదావరి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మూసీ ప్రాజెక్టును ఆధునికీకరించడంతో ఆయకట్టులో రెండు సీజన్లకు నీళ్లు అందుతున్నాయి. వైద్యరంగంలో బలోపేతమయ్యాం.. జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు రావడం మా ప్రభుత్వంతోనే సాధ్యమైంది. సూర్యాపేటలో కూడా వైద్యకళాశాల ఏర్పాటు కావడంతో వైద్య రంగంలో జిల్లా మరింత ముందంజలో ఉంది. మెడికల్ కళాశాల జిల్లాకు కలికితురాయి. కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కార్పొరేట్ స్థాయిని మించి వసతులు ఏర్పాటవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఇప్పటికే రోడ్ల వెడల్పు, జంక్షన్ల నిర్మాణ పనుల కార్యక్రమం మొదలైంది. సద్దల చెరువు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా రూపుదిద్దుకుంటోంది. పట్టణ నడిబొడ్డున మోడల్ మార్కెట్ నిర్మాణం అయింది. మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో అగ్రభాగాన నిలిచింది. ⇒ ఎన్నికల హామీలు నెరవేరుతున్నాయి.. నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి.. ఎన్నికల హామీలన్నీ నెరవేరుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని ఇంటింటికీ తాగునీరు అందించడంతోపాటు సాగునీటి సమస్యను కూడా పరిష్కరించాం. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను మరింత అభివృద్ధి పరిచి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండేళ్ల కాలంలో నల్లగొండ నియోజకవర్గంలో మున్సిపాలిటీతోపాటు మూడు మండలాల్లో సీసీ రోడ్లు నిర్మించాం. మరో మూడేళ్లలో నియోజకవర్గాన్ని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నల్లగొండ పట్టణానికి రెండో పైప్‌లైన్ తీసుకొచ్చి తాగు నీటి సమస్య లేకుండా చేశా. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నాం. నల్లగొండను మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నా. గత పాలకులు వదిలేసిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.18కోట్లు మంజూరు చేసింది. పనులు త్వరలో పూర్తి చేయిస్తాం. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీలు పెంచడంతోపాటు డయాలసిస్ వ్యవస్థను మెరుగు పర్చాం. సిటీస్కాన్ ఉపయోగంలోకి తెచ్చాం, ఎంఆర్ఎస్ స్కాన్ , కేన్సర్ యూనిట్కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. రూ.275 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీలోని 32ఎకరాల విస్తీరణంలో మెడికల్ కళాశాల నూతన భవనం నిర్మించబోతున్నాం , దానికి సీఎం త్వరలో శంకుస్థాపన చేస్తారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ముందున్నాం. ⇒ రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు: మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలే కాకుండా అంతకంటే ఎక్కువ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. మిర్యాలగూడ పట్టణంలో రూ.100 కోట్లతో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాం. ఆగిపోయిన మినీ రవీంద్రభారతికి రూ.3కోట్లు కేటాయించాం. సంత్‌సేవాలాల్ భవనం, జ్యోతిరావుపూలే భవనం నిర్మిస్తున్నాం. మూడు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి రూ.525 కోట్లు మంజూరయ్యాయి. రూ.17 కోట్లతో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్ పనులు సాగుతున్నాయి. రూ.50 కోట్లతో పలు గ్రామాల్లో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశాం. కేఎన్ఎం కళాశాలను ప్రభుత్వ పరం చేయడంతోపాటు జూనియర్ కళాశాలలో రూ.3కోట్లతో తరగతి గదులను నిర్మిస్తున్నాం. పట్టణంలో 560 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రూ.50 కోట్లతో 31 చెక్ డ్యామ్‌లను నిర్మించనున్నాం. మిర్యాలగూడ పట్టణంలో 80 పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాం. ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి చేయనున్నాం. ⇒ తొలి ఏడాదిలోనే సగం వాగ్దానాలు పూర్తి చేశా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్: ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన వాగ్దానాల్లో సగం పూర్తి చేశా. , మిగిలినవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తా. ఇచ్చిన హామీ మేరకు తీవ్ర సాగునీటి కొరతను ఎదుర్కొంటున్న మోతె, మునగాల, నడిగూడెం మండలాలకు కాళేశ్వరం జలాలను తీసుకొచ్చా. కోదాడ పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేశాం. కోదాడ ట్యాంక్‌బండ్ పనులతో పాటు మరో 8ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేసి పెద్దచెరువును పర్యాటక ప్రాంతంగా మారుస్తాం. పేదలకు 1,840 డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరలో పంపిణీ చేస్తాం. ఇంటిస్థలం ఉన్న మరో 3 వేల మందికి రూ.5లక్షలు ఇప్పించడానికి కృషి చేస్తా. ⇒ హామీలు పురోగతిలో ఉన్నాయి హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి: నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు పురోగతిలో ఉన్నాయి. నియోజకవర్గంలో చివరి భూములకు నీరందించేందుకు లిఫ్ట్‌లపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా పులిచింతల ప్రాజెక్ట్‌లో ముంపునకు గురవుతున్న అడ్లూరు, చింతిర్యాల, గుర్రంబోడు, రేబల్లె లిఫ్ట్‌లను తరలించేందుకు రూ.75 కోట్లు మంజూరు చేయించాం. అదేవిధంగా చెక్‌డ్యాంలు నిర్మించేందుకు రూ.32 కోట్లు మంజూరయ్యాయి. మేళ్లచెరువు, మఠంపల్లి, మండలాల్లో చాలా వరకు లింక్ రోడ్లు, బ్రిడ్జి మంజూరు చేయించా. కొన్ని పూర్తి అయ్యాయి. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. హుజూర్నగర్ రింగ్ రోడ్డు మిగిలిన పనులకుగాను రూ.5 కోట్లు మంజూరు చేయించా. మిగిలిన పనులు త్వరలో పూర్తవుతాయి. ఏరియా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంక్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నా. ఈఎస్ఐ ఆస్పత్రి కోసం మేళ్లచెరువులో 5ఎకరాల భూమి కేటాయించాం. మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలకు సంబంధించిన కేసులు కోదాడ కోర్టుకు వెళ్తున్నాయి. వాటిని హుజూర్నగర్ కోర్టు పరధిలోకి తెచ్చే అంశం ఫైల్ సీఎం కేసీఆర్ దగ్గర ఉంది. త్వరలోనే క్లీయర్ అవుతుంది. హుజూర్‌నగర్‌లో ప్రత్యేకంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతే కాకుండా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మఠంపల్లి మండలంలో 2,500 ఎకరాలు భూ సేకరణ జరిగింది. మిగతా పనులు కూడా పూర్తి చేస్తాం. ⇒ సాగునీరు, సౌకర్యాల కల్పనకు పెద్దపీట భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి: భువనగిరి నియోజకవర్గంలో సాగునీరు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. రానున్న మూడేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతా. కరోనా కష్టకాలంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడానికి నియోజకవర్గ అభివృద్ధి నిధులను నిలిపివేశారు. అయినప్పటికీ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ అండతో రూ.20 కోట్లతో హెచ్ఎండీఏ నిధులతో నియోజకవర్గంలో మురుగు కాలువలు, సీసీరోడ్లు చేపట్టాం. 90 శాతం పనులు పూర్తి కావచ్చాయి. అన్ని గ్రామాల రైతులకు సాగు నీరందిస్తాం. బస్వాపురం రిజర్వాయర్ పూర్తి కావస్తోంది. రిజర్వాయర్‌లో1.5 టీఎంసీల కాళేశ్వరం నీరు రైతులకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా మూసీ కాల్వలైన బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలను పూర్తి చేస్తున్నాం. జిల్లా కేంద్రమైన భువనగిరిలో రూ.8.72 కోట్లతో మోడల్‌మార్కెట్ నిర్మాణం జరుగుతోంది. రోడ్డు వెడల్పు కోసం రూ.15.18 కోట్లతో పనులు చేపట్టాం. రూ.1.60కోట్లతో స్మృతి వనం పనులు జరుగుతున్నాయి. మున్సిపాలిటీకి మరో రూ.50 కోట్లతో అభివృద్ధిపనుల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ⇒ పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య : ప్రధానంగా నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టు ప నులపై దృష్టి సారించా. ఉదయసముద్రంతోపాటు, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను పూర్తిచేయించి సాగునీరు అందించడానికి కృషిచేస్తా. పిలాయిపల్లి ఆధునికీకరణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ధర్మారెడ్డిపల్లి ఆధునికీకరణ పనులు 70శాతం పూర్తయ్యాయి. వచ్చే వేసవి వరకు పెండింగ్ పనులను పూర్తి చేయించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. ఆసిఫ్‌నహర్, శాలిగౌరారం ప్రాజెక్టు కాలువల మరమ్మతులకు రూ.25కోట్లు, ఎర్రకాలువ పునర్నిర్మాణానికి రూ.30కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. నకిరేకల్, రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయిని 100 పడకలకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు అవసరమైన పోస్టులు మంజూరయ్యాయి. నకిరేకల్‌లోని డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు కట్టించేందుకు కృషి చేస్తా. చిట్యాల పట్టణంలో ప్రమాదాల నివారణకు జాతీయ రహదారి వెంట ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంటుంది. నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్లో కోల్డ్స్టోరీజే ఏర్పాటు చేయిస్తా. ⇒ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నా.. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నా. ఎన్నికల సమయంలో దేవకకొండ నియోజకవర్గంలోని ప్రజలకు డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో పాటు దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా మార్చుతా. పొగిల్ల, నంబాపురం అంబాభవాని ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానని హామీలు ఇచ్చా. ఈ మేరకు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా గొట్టిముక్కుల, సింగరాజుపల్లి, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అదేవిధంగా దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా మార్చే క్రమంలో ఇప్పటికే ఖిలాలో పార్కు ఏర్పాటుకు రూ.5కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. వెనుకబడ్డ చందంపేట మండల గిరిజనుల కోసం పొగిల్ల, అంబాభవాని, నంబాపురం ఎత్తిపోత పథకాలు సైతం కార్యరూపం దాల్చేందుకు పేపర్ పనులు పూర్తి చేశాం. నియోజకవర్గంలో ఇప్పటికే 526 డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. మండలాల్లో స్థల సేకరణ జాప్యంతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. త్వరలోనే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తా. కోర్టు కేసుల నేపథ్యంలో వంద పడకల ఆస్పత్రి కార్యరూపం దాల్చే క్రమం కొంత ఆలస్యమైంది. కోర్టు కేసులు పూర్తయినందున త్వరలోనే వంద పడకల ఆస్పత్రికి పూర్తి స్థాయిలో వైద్యసౌకర్యాలు, సిబ్బంది వచ్చే అవకాశం ఉంది. -
వివాదంగా మారిన ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకలు
సాక్షి, సంగారెడ్డి : లాక్డౌన్ సమయంలో సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం వివాదంగా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు సురేష్ షెట్కార్, సంజీవరెడ్డిలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా, పోలీస్టేషన్‌ను పార్టీ కార్యాలయంగా మార్చారని మండిపడుతున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నారాయణ్ ఖేడ్‌లో భూపాల్‌రెడ్డి ఘనంగా పుట్టిన రోజు వేడుకులను జరిపారని ఆరోపిస్తున్నారు. దీనికి వందల మంది అతిథులు హాజరయ్యారని, బర్త్ డేకు వచ్చిన వారంతా ఎలాంటి సామాజిక దూరం పాటించకుండా పక్కపక్కనే కూర్చున్నారని విమర్శించారు. దీనిపై వారు హైకోర్టును సైతం ఆశ్రయించారు. (దశల వారీగా షూటింగ్స్‌కు అనుమతి) మరోవైపు భూపాల్‌రెడ్డి పుట్టినరోజుకు సంబంధించి స్థానిక ఓ విలేఖరి వార్తను ప్రచురించినందుకు ఎమ్మెల్యే అనుచరులు అతనిపై దాడికి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని వార్తను రాసినందుకు ఆ విలేఖరి ఇళ్లును కూల్చివేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ఓ జాతీయ మీడియా సంస్థ వార్తను ప్రచురించడం గమనార్హం. నిర్మాణంలో ఉన్న ఇంటిని అక్రమ కట్టడంగా భావించి జర్నలిస్ట్‌పై కక్షపూరితంగా వ్యవహరించి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆదేశాలతో ఇంటిని కూల్చి వేశారని ఆ పత్రిక పేర్కొంది. ఇక తాజా వివాదంపై నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి స్పందించారు. తన పుట్టిన రోజు నాడు అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు వక్రీకరించారని తెలిపారు. కరోనా ఉధృతంగా ఉన్నందున జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నానని చెప్పారు. ‘ఆరోజు నా శ్రేయోభిలాషులు నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ , రక్త దానం చేశారు. అందులోనూ భౌతిక దూరం పాటించారు. కావాలనే కొన్ని ఛానళ్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వాస్తవాలు తెలుసుకొని ప్రసారం చేయాలి. కాంగ్రెస్ నేతలు హైకోర్టులో వేసిన కేసు నిలువదు’ అని చెప్పుకొచ్చారు. -
కంచర్ల వర్సెస్ రాజగోపాల్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండలో బుధవారం జరిగిన పంచాయతీ రాజ్ సమ్మేళనంలో ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మధ్య వా గ్వాదం చోటు చేసుకుంది. మంత్రి జగదీశ్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమ్మేళనంలో మొదట రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో అనుకున్న విధంగా అభివృద్ధి జరగడం లేదని, ప ల్లె ప్రగతికి సరిపడా నిధులు రావడం లేదని విమర్శించారు. తర్వాత భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘రైతుబంధు, రైతు బీమాలాంటి సంక్షేమ పథకాలు ప్రతిపక్షాల కళ్లకు కనిపించడం లేదా..? ఇంతకు ముందున్న మంత్రి ఏం చేశాడు’.. అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు లేచి భూ పాల్ అన్న జై అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన రాజగోపాల్‌రెడ్డి.. వ్యక్తిగతంగా మా ట్లాడుతున్నావంటూ భూపాల్‌రెడ్డి ప్రసంగాన్ని అ డ్డుకోబోయారు. దీనికి భూపాల్‌రెడ్డి ‘నువ్వు మా ట్లాడినంతసేపు నేను అడ్డుకోలేదు.. నేను మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడవద్దు’అని అన్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. భూపాల్‌రెడ్డి.. రాజ్‌గోపాల్‌రెడ్డి కూర్చున్న వైపు దూసుకురావడంతో వేదికమీద ఉన్న నాయకులు, పోలీసులు ఇద్దరినీ సముదాయించారు. సమ్మేళనం రాజకీయాల కోసం కాదు.. ఆ తర్వాత విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, ఇది రాజకీయాల కోసం పెట్టుకున్న సమ్మేళనం కాదని, ప్రజల నమ్మకానికి అనుగుణం గా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలంటూ అంతకుముందు జరిగిన వాగ్వాదంపై వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆకలి, దరిద్రాన్ని పా రదోలిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. -
టీఆర్ఎస్లో.. టికెట్ల లొల్లి!
సాక్షి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్లో టికెట్ల లొల్లి షురూ అయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటున్న ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది. ఒక్కో వార్డులో కనీసం ఇద్దరినుంచి ముగ్గురు దాకా టికెట్ల కోసం పోటీ పడుతున్నా రు. అందరికీ టికెట్ కేటాయించడం సాధ్యం కాని పనికావడంతో స్థానిక నాయకులు సైతం బుజ్జగించే పనిలో పడ్డారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావడం, మున్సిపల్ ఎన్నికలు మినహా మరో ఐదేళ్ల దాకా ఎలాంటి ఎన్నికలూ లేకపోవడంతో ఇదే చివరి అవకాశంగా భావిస్తున్నారు. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో కొన్ని పల్లెలూ వార్డులుగా మారిపోవడంతో కౌన్సిలర్ పదవుల కోసం పోటీ ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా ఏడు మున్సిపాలిటీల్లో 162 వార్డులు ఉన్నాయి. దీంతో టికెట్ దక్కకుంటే రెబల్‌గా బరిలోకి దిగాలని భావిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ప్రత్యేక ప్యానెల్‌తో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు టికెట్ దక్కదని టీఆర్ఎస్ కేడర్ భావిస్తున్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల నాటినుంచి ఈ సమస్య ముదిరిపోయింది. ఈ నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతున్న చిట్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను తమకు ఒక్క టికెట్ కూడా దక్కే అవకాశం లేదని భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గం ఒక విధంగా స్థానిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిందని చెబుతున్నారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రవీందర్ నాయకత్వంలో మంగళవారం చిట్యాలలో అసంతృప్తుల సమావేశం జరిగింది. కాంగ్రెస్, సీపీఎంలతో కలిసి టీఆర్ఎస్ పాత నాయకులు ప్రత్యేకంగా ప్యానెల్ ఏర్పాటు చేసుకుని పోటీకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మండలంనుంచే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడి టికెట్ల కేటాయింపులో వీరి ప్రభావం కొంత ఉండే అవకాశం ఉన్నా.. మున్సిపాలిటీల గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలకే అప్పజెప్పినందున, చిట్యాల గెలుపు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తికి సవాల్‌గా మారింది. వీరేశం వర్గానికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరన్న ముందస్తు అంచనాతో ప్రత్యేక ప్యానెల్‌గా పోటీకి దిగాలని భావిస్తున్నారని చెబుతున్నారు. రెబల్స్ బెడద ఎన్నాళ్లనుంచో పార్టీలో పనిచేస్తున్న వారికీ టికెట్లు దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న అంచనాతో వారిలో అత్యధికులు రెబల్స్‌గా బరిలోకి దిగాలని చూస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే జిల్లాలో టీఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థుల ప్రకటన మొదలైంది. జిల్లా కేంద్ర మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోమవారమే 18 వార్డులకు అభ్యర్థులను ప్రకటించారు. మరికొన్ని కూడా ప్రకటించాల్సి ఉన్నా.. అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నిలిపివేశారని సమాచారం. గత మున్సిపల్ ఎన్నికల్లో (2014) ఆయా వార్డులనుంచి పోటీ చేసి ఓడిపోయిన వారు ఈసారి మళ్లీ టికెట్లు ఆశిస్తున్నారు. అయితే, ఇక్కడ కాంగ్రెస్, ఇతర పార్టీలనుంచి గెలిచిన వారు టీఆర్ఎస్లో చేరారు. సిట్టింగ్‌లను పక్కన పెట్టే పరిస్థితి లేకపోవడంతో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన పార్టీ కేడర్ తమకే ఇవ్వాలని పట్టుబడుతోంది. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందంటున్నారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలు టీఆర్ఎస్ రాజకీయాలను వేడెక్కించాయి. టీ ఆర్ఎస్లో టికెట్ దక్కని వారు బయటకు వచ్చి రెబల్స్ పోటీ చేస్తే తమ పార్టీలోకి ఆహ్వానించాలని కాంగ్రెస్, బీజేపీలు ఎదురు చూస్తున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అత్యధిక వార్డుల్లో విజయం సాధిస్తాం మున్సిపల్ ఎన్నికల్లో చిట్యాలలో అత్యధిక వార్డుల్లో విజయం సాధిస్తామని చిట్యాల మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుడు శేపూరి రవీందర్ అన్నారు. చిట్యాలలో మంగళవారం ఆయన తన వర్గీయులతో కలిసి సమావేశం నిర్వహించారు. తను వీరేశంవర్గం కావడంతో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోటీకి అవకాశం ఇవ్వరనే ఆలోచనతోనే ముందస్తుగానే కలిసి వచ్చే పార్టీలతోపాటు తన వర్గానికి చెందిన పలువురు నాయకులతో కలిసి బరిలో దిగాలని ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్లో తనతో కలిసి వచ్చే నాయకులతోపాటు వివిధ పార్టీలతో పొత్తులతో ఓ ప్యానెల్‌గా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఆ నాయకులు శేపూరి జయమ్మ, తాడూరి చంద్రం, కుక్కల మోహన్, మన్నెం సైదులు, దామానూరి అశోక్, కోనేటి కృష్ణయ్య, పల్లపు వెంకటయ్య, వావిళ్ళ భారతమ్మ పాల్గొన్నారు. -
ఆ చాలెంజ్ చాలా గొప్పది : ఎమ్మెల్యే
నల్లగొండ టూటౌన్ : సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం స్పూర్తితో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్పదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే (143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపు మేరకు సోమవారం నల్లగొండ జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ఎమ్మెల్యే జర్నలిస్టులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గ్రీన్ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడడం యువతకు స్పూర్తిదాయకమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలు, యువతలో మార్పు వచ్చి వారి ఇళ్ల ముందు మొక్కలు నాటి పెంచుకుంటారని తెలిపారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఉన్న వెల్నెస్ సెంటర్‌ను సందర్శించి ఉద్యోగులు, జర్నలిస్టులకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (143) జిల్లా అధ్యక్షుడు క్రాంతి, ప్రధాన కార్యదర్శి గుండగోని జయశంకర్‌గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మర్రి మహేందర్‌రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు, అబ్బగోని రమేష్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, వివిధ దిన పత్రికలు, వీడియో, ఫొటో జర్నలిస్టులు పాల్గొన్నారు. -
అబుల్‌కలాం ఆజాద్ సేవలు మరువలేనివి
సాక్షి, నల్లగొండ: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఎన్నో విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టిన డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివని ఇన్చార్జ్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యాదినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో సమగ్ర విద్యావిధాన రూపకల్పనకు పునాదులు వేశారన్నారు. మౌలానా అబుల్ కలాం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం.. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యనందించేందుకు గురుకుల పాఠశాలలు నెలకొల్పినట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం స్వాతంత్య్ర సమరయోధుడుగా, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశం కోసం ఎంతగానో శ్రమించారన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఎకరాలు భూమి కేటాయించినట్లు.. గురుకుల పాఠశాలకు శాశ్వత బిల్డింగ్‌కు ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సుభద్ర, జిల్లా మత్స్యశా>ఖ అధికారి చరిత, మైనార్టీ జూని యర్ కళాశాల ప్రిన్సిపాల్ మునీరుద్దీన్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బుర్ఖాన్, రీజినల్ కోఆర్డినేటర్ జమీల్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అహ్మద్ ఖలీం, కార్యదర్శి హాషం, టీఆర్ఎస్ నాయకులు బషీర్, జెడ్పీకోఆప్షన్ సభ్యులు జాన్ శాస్త్రి పాల్గొన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో జాతీయ విద్యాదినోత్సవాన్ని నిర్వహించారు. అబుల్‌కలాం చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
‘మెదక్‌ను హరితవనం చేయాలి’
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మూడు కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట మండలం కమలాపూర్, జంబికుంట గ్రామాల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీఆర్డీఏ ఏపీడీ సీతారామారావులతో కలిసి వర్షంలోనే మొక్కలు నాటారు. మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా జంబికుంట ప్రధాన రహదారి నుంచి గ్రామం వరకు ఇరువైపులా జూనియర్ కళాశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జంబికుంట, పేటలోని స్త్రీశక్తి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహించిన హరితహారంలో మొక్కలను నాటి పట్టించుకోలేదన్నారు. ఈ సారి నూతన పంచాయితీరాజ్ చట్టం ప్రకారం ప్రతీ మొక్కకు పక్కా లెక్కతో పాటు ప్రతీ గ్రామంలో 47 వేల మొక్కలను నాటడంతో సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. 85 శాతం మొక్కలను కాపాడకపోతే సర్పంచ్, గ్రామ కార్యదర్శిపై వేటు తప్పదన్నారు. గ్రామ సభలు క్రమం తప్పకుండానిర్వహించుకొని ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. కర్ణాటక, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి 15 నుంచి 20 రకాల పండ్ల మొక్కలను తెప్పించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతీ యేటా 100 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళిక చేపట్టినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా అధికారులు జిల్లాలో మొక్కలను పెంచాలన్నారు. దీంతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా మారేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఇంకుడుగుంతలు చేపట్టడంతో పాటు నీటిని వృథా చేయకూడదని కోరారు. ఎస్బీఎం ద్వారా నిర్మించిన టాయిలెట్స్‌ను వినియోగించుకొని అంటురోగాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలి.. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. ప్రతీ గ్రామం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. చెట్లు నాటడమే కాకుండా సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. ఇథియోఫియా దేశాన్ని ఆదర్శంగా తీసుకొని హరితహారం విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యులు విజయరామరాజు, ఎంపీడీఓ బన్సీలాల్, తహసీల్దార్ కిష్టానాయక్, సర్పంచ్‌లు కుంట్ల రాములు, మామిడి సాయమ్మ, ఎంపీటీసీ స్వప్నరాజేశ్, రైతు సమితి అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, ఏపీఓ సుధాకర్, ఏపీఎం గోపాల్, పీఆర్ ఏఈ రత్నం, ఏఓ రత్న, నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అల్లాదుర్గంలో మొక్కలు నాటిన కలెక్టర్ అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం రేణుకా ఎల్లమ్మ ఆలయం ఆవరణలో శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ధర్మారెడ్డి మొక్కలు నాటారు. అంతకుముందు రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షం పడుతున్నా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడి టీచర్లు, డ్వాక్రా గ్రూపు మహిళలు, ఈజీఎస్ సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ సీతరామారావ్, అడిషనల్ పీడీ, ఐసీడీఎస్ పీడీ రసూల్‌బీ, మండల ప్రత్యేక అధికారి సుధాకర్ ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సౌందర్య, సర్పంచ్ అంజయ్య యాదవ్, సీడీపీఓ సోమశేఖరమ్మ, ఎంపీడీఓ రాజమల్లయ్య, మాజీ ఎంపీపీ కాశీనాథ్, ఏపీఎం అశోక్, సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్ఐ మహ్మద్‌గౌస్ తదితరులు పాల్గొన్నారు. చెత్త రహిత జిల్లాగా మార్చేద్దాం మెదక్ జోన్: మెదక్ జిల్లాను సంపూర్ణ ఆరోగ్యం, చెత్త రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా విద్యార్థులను చైతన్యం చేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరెట్లో ప్రధానోపాధ్యాయులతో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి నర్సరీని ఏర్పాటు చేసి అందులో పలు రకాల పండ్లు, పూల మొక్కలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. పాఠశాలల్లో అన్ని రకాల మొక్కలు నాటాలన్నారు. ఉపాధి హామీ కూలీలతో పాఠశాల ప్రాంగణంలో వందకుపైగా గుంతలు తీయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 7న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో హరితహారం కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో 50 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి హైదరాబాద్‌కు రిసైక్లింగ్ కోసం పంపించినట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే చెత్త రహిత గ్రామాలుగా రూపు దిద్దుకుంటాయన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలని ఎంపీడీఓలకు ఆదేశాలు జారిచేసినట్లు తెలిపారు. అనంతరం ఐలవ్ మై జాబ్ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో జిల్లా స్థాయిలో నిలిచిన విజేతలను కలెక్టర్ సన్మానించారు. వహిదుల్లా షరీఫ్(బాలుర ఉన్నత పాఠశాల, మెదక్), సుకన్య(జెడ్పీహెచ్ఎస్, పాపన్నపేట), సమీర్(జెడ్పీహెచ్ఎస్ కుసంగి), సాజిద్ పాషా(ప్రాథమిక పాఠశాల బొడ్మట్‌పల్లి)లను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రవికాంత్‌రావు, నోడల్ అధికా>రి మధుమోహన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సెక్టోరియల్ అధికారులు నాగేశ్వర్, సుభాష్, ఏడీ భాస్కర్‌తోపాటు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
నా కూతుర్ని దేవుడు నడిపిస్తాడు: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నల్లగొండ : ‘నిత్యం ప్రజల్లో ఉండడం నాకిష్టం. మా ఊరు చిట్యాల మండలం, ఉరుమడ్ల గ్రామం. మా నాన్న కంచర్ల మల్లారెడ్డి. గ్రామంలో ఏ పేద ఇంట్లో పెళ్లి అయినా, ఎవరికైనా ఆపద వచ్చినా వారిని మా నాన్న ఆదుకోవడం మా చిన్నతనం నుంచి చూస్తున్నా.. అప్పుడే నేను అందరిలోఒకడిగా ఉంటూ వారికి సాయం చేయాలనే ఆలోచన వచ్చింది. చదువు పూర్తయిన తర్వాత రాజకీయాల వైపు మళ్లా.. అందుకు మా అన్న కంచర్ల కృష్ణారెడ్డి ప్రోత్సాహం, సహకారం అంతాఇంతా కాదు. అన్నీ తానై నడిపించాడు. నన్ను అర్థం చేసుకునే నా కుటుంబ సభ్యులంతా నాకు సహకారం అందించారు. చిన్నప్పుడు మా నాన్న గ్రామంలో పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించేవారు. అదే ప్రస్తుతం మా గ్రామంలో కొనసాగిస్తున్నాం. 2008 నుంచి గ్రామంలో ఏ ఆడపిల్ల పెళ్లి అయినా రూ.20వేలు ఆర్థికసాయం మా కుటుంబం తరఫున అందజేస్తున్నాం. నా అభ్యున్నతికి మా అన్నయ్య ముందుండి అన్నీ నడిపిస్తే నా భార్య రమాదేవి, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ప్రోత్సహించారు’ అని అంటున్నారు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి. ఆయన శనివారం ‘సాక్షి’కి పర్సనల్ టైమ్ ఇచ్చారు. తన చిన్ననాటి విషయాలు, విద్యాభ్యాసం మొదలుకొని కుటుంబంలో తన పాత్ర తదితర విషయాలను వెల్లడించారు. సాక్షి : మీ కుటుంబ నేపథ్యం ఏమిటీ? ఎమ్మెల్యే : మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా నాన్న కంచర్ల మల్లారెడ్డి గ్రామంలో పేదల ఇళ్లలో పెళ్లిళ్లు జరిగినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేవారు. ఏ సమస్య ఉన్నా ప్రజలు మా ఇంటివద్దకే నిత్యం వచ్చేవారు. మా నాన్న వారికి సహకరిస్తూ వచ్చేవారు. నాన్న సేవాభావం చూసే రాజకీయాల్లోకి రావాలనే కోరిక నాలో మొదలైంది. నాటినుంచి నేటివరకు మా నాన్న మార్గంలోనే నడుస్తూ పేదలకు సహాయం చేస్తున్నా. సాక్షి : మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది? ఎమ్మెల్యే : 10వ తరగతి వరకు సొంత గ్రామం ఉరుమడ్లలోనే చదివాను. ఇంటర్మీడియట్ చిట్యాల రవి జూనియర్ కళాశాలలో చదివా. బీకాం డిగ్రీ హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో చేశాను. సాక్షి : చిన్ననాటి పరిస్థితులు ఏమిటీ? ఎమ్మెల్యే : చిన్నప్పుడు మా మేనమామ ఊరు నెర్మట, వాళ్ల మేనమామ ఊరైన జైకేసారం వెళ్లి ఈత కొట్టేవాళ్లం. కబడ్డీ, క్యారమ్స్, ఇతర ఆటలు కూడా వేసవి సెలవుల్లో ఆడేవాళ్లం. గ్రామీణ ఆటలు జిల్లగోన బాగా ఆడేవాళ్లం. సాక్షి : ఊరిలో దేవాలయం నిర్మించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది..? ఎమ్మెల్యే : నా చిన్నతనంలో దేవాలయం మంచిగా ఉండేది. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోలేదు. దేవాలయంలో గేదెలను కట్టేసేవారు. అది చూసి గ్రామంలో దేవాలయం నిర్మించి పుణ్యక్షేత్రంగా మార్చాలన్న ఆలోచన వచ్చింది. రూ.3.50 కోట్లతో గ్రామంలో శివాలయంలో శ్రీ రామలింగేశ్వర, శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాలతో పాటు ఉపదేవాలయాలను నిర్మించాం. మాగ్రామంలో ఎంపీ, మంత్రి, ఇతర పెద్ద నాయకులైనవారు ఉన్నారు. దేవాలయం ఇలా ఉంటే బాగుండదనే ఉద్దేశంతో దేవుని సంకల్ప బలంతోనే దేవాలయ నిర్మాణానికి పూనుకొని పూర్తి చేయించా.. శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతితో పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం చేయించా. ఇప్పుడు పుణ్యక్షేత్రంగా మారింది. ఇందుకు మా కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. సాక్షి : మీ జీవితంలో అత్యంత బాధ కలిగించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఎమ్మెల్యే : నా చిన్నతనంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేయి విరిగింది. ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చెయ్యిని తొలగించారు. అప్పుడు చాలా బాధకలిగింది. రెండోసారి నాకు కూతురు పుట్టిన తర్వాత ఆమె నడవ లేదని తెలిసినప్పుడు చాలా బాధ కలిగింది. కానీ నా జీవితంలో నా కూతుర్ని దేవుడు నడిపిస్తాడన్న నమ్మకం నాకు ఉంది. సాక్షి : సంతోషకరమైన సంఘటన ఏమిటీ.? ఎమ్మెల్యే : నల్లగొండ ఎమ్మెల్యేగా గెలవడమే నాకు అత్యంత సంతోషకరమైన సంఘటన. సాక్షి : వేసవిలో పాపతో కలిసి సందర్శనలకు వెళ్లారా..? ఎమ్మెల్యే: నాకు దేవుడిపై నమ్మకం ఎక్కువ..అందుకే సెలవులు ఉంటే కుటుంబ సమేతంగా తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికే వెళ్తాం. ఇటీవల కుటుంబ సమేతంగా శ్రీనివాసుడిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నాం. సాక్షి : రాజకీయంగా బిజీగా ఉంటారు కదా.. కుటుంబ వ్యవహారాల్లో ఎలా పాలు పంచుకుంటారు..? ఎమ్మెల్యే: నిజమే.. రాజకీయాల్లో బిజీగా ఉంటాను. అయినప్పటికీ ఎంత రాత్రి అయినా పాపతో మాట్లాడే పడుకుంటాను. నాకంటే ఎక్కువగా నా భార్య రమాదేవే అన్నీ చూసుకుంటుంది. ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. బయట అన్నయ్య చూసుకుంటాడు. ఇంట్లో నా భార్య చూసుకుంటుంది. సాక్షి : మీ పెళ్లి అరేంజ్డ్.. ప్రేమ వివాహమా? ఎమ్మెల్యే : మాది పెద్దలు కుదిర్చిన వివాహం. 2007 ఫిబ్రవరి 21న జరిగింది. మాకు ఒక కూతురు. ఆమె పేరు శ్రీలక్ష్మి, 4వ తరగతి చదువుతోంది. సాక్షి : రోజువారీ కార్యక్రమాలు ఏమిటీ? ఎమ్మెల్యే : ప్రతిరోజూ లేవగానే తయారై వివిధ పనులపై వచ్చేవారితో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుంటాను. ఇతర కార్యక్రమాలు ఉంటే గ్రామాలకు వెళ్లడం, పార్టీ, ప్రజా కార్యక్రమాలను చూసుకోవడమే. నేను ప్రతిరోజూ రాజకీయంగా బిజీగా ఉన్నా ఎంత రాత్రైనా ఇంటికి వచ్చిన తర్వాత మా కూతుర్ని మందలించే పడుకుంటాను. నా కూతురు నడవలేకపోయినా ఆమె స్కూల్‌కు బస్సులోనే వెళ్తుంది. అన్నెపర్తిలోని జీస్కూల్లో చదువుతుంది. ఆమె గొప్పగా చదవాలన్నదే నా కోరిక. ఆ విధంగా ప్రోత్సహిస్తున్నాం. భార్య రమాదేవి : ప్రతిరోజూ ఉదయం పాపను తయారు చేసి స్కూల్‌కు పంపడం, నా భర్త బయటికెళ్లే వరకు ఆయన పనులు చేసి పెడతాను. ఆ తర్వాత ఇంటి పనుల్లో నిమగ్నమవుతుంటాను. పాప పెంపకంలో ఇద్దరి పాత్ర ఒకే విధంగా ఉంటుంది. మావారు పాపలో ఇప్పటినుంచే తను ఏవిధంగా చదవాలి, ఎలా పనులు చేసుకోవాలనే విషయాల్లో ప్రోత్సహిస్తుంటారు. చదువు, పెంపకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. -
కంటతడి పెట్టిన కంచర్ల దంపతులు
నల్లగొండ రూరల్ : కాంగ్రెస్ ఓటమి భయంతోనే దాడులకు దిగుతోందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేం దర్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ నల్లగొండ ఎమ్మె ల్యే అభ్యర్థి కంచర్ల భూ పాల్‌రెడ్డిని గెలిపిం చాలని కోరుతూ ఆయ న సతీమణి రమాదేవి ఎస్ఎల్బీసీలో ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రచార రథం ఫ్లెక్సీలను చించివేసి, డ్రైవర్‌పై దాడి చేశారని ఆరోపిస్తూ ఆ పార్టీ శ్రేణులు శనివారం స్థానిక క్లాక్‌టవర్ సెంటర్లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓటమి ఖాయమని తేలిపోవడంతోనే ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని, గులాబీ శ్రేణులు శాంతి యుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయన్నారు. నల్లగొండలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. లక్ష చేతులతో ఓడిస్తా : కంచర్ల కోమటిరెడ్డి దగ్గరుండి కార్యకర్తలతో భౌతిక దాడులు చేయిం చడం దుర్మార్గమైన చర్యని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆటోడ్రైవర్‌పై దాడి చేయడం, ప్రచార రథం ఫ్లెక్సీని చించి తనను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడడం సరికాదన్నారు. తన అవిటితనాన్ని ఉద్దేశించి అవహేళన వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డిని వచ్చే ఎన్నికల్లో లక్ష చేతులతో ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై చేసిన అవహేళన వ్యాఖ్యలు ఎంతో బాధిస్తున్నాయని గద్గదస్వరంతో అంటూ కాన్నీరు కార్చడంతో ఆయన సతీమణి, కూతురు కూడా కంటతడిపెట్టారు. సాగర్ రోడ్డులో రమాదేవి నిరసన.. కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రచారరథంపై ఉన్న ఫ్లెక్సీలను చించి, డ్రైవర్‌పై దాడి చేశారని ఆరోపిస్తూ కంచర్ల సతీమణి రమాదేవి చర్లగౌరారం స్టేజ్ వద్ద నిరసనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఎస్పీకి ఫిర్యాదు నల్లగొండ క్రైం : కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రచార రథం ఫ్లెక్సీల తొలగింపు, డ్రైవర్‌పై దాడి, మహిళ కౌన్సిలర్లను అవమానించారని ఆరోపిస్తూ ఆ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, పార్టీ ఎన్నికల పరిశీలకులు రవీందర్రావు, మాజీ మున్సిపల్ చైర్మెన్ బోయపల్లి కృష్ణారెడ్డి, నిరంజన్‌వలీ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్ఎల్బీసీలో జరిగిన దాడి ఘటనపై టీఆర్ఎస్ నాయకుడు రామ రాజు యాదవ్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నర్సింగ్శ్రీనివాస్, డబ్బ వెంకన్న.చింతల విజయ్, మంగలి శ్రీను, కడారి వెంకన్న, నల్లబొతు శంకర్, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మురళి తెలిపారు. -
భూపాల్‌రెడ్డిని ఇబ్బంది పెట్టినందుకే..
సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని ఇబ్బందులకు గురి చేసినందుకే ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను సస్పెం డ్ చేశామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్ వెల్లడించారు. మంగళవారం టీఆర్ఎస్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదనే అక్కసుతోనే రాములు నాయక్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులంతా తన వెంట ఉన్నారని ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయనకు అంత స్థాయి లేదని విమర్శించారు.