
భూపాల్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి వీడ్కోలు పలుకుతున్న ఎమ్మెల్సీలు, తదితరులు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో మెదక్ ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తి చేసుకున్న శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ వి.భూపాల్‌రెడ్డికి మంగళవారం వీడ్కోలు పలికారు. శాసనమండలి చైర్మన్ చాంబర్‌లో భూపాల్‌రెడ్డిని ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, తేరా చిన్నపరెడ్డి సన్మానించారు. అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు, మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి తదితరులు భూపాల్‌రెడ్డికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.
కాగా, ప్రొటెమ్ చైర్మన్ భూపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా కాలపరిమితి పూర్తి చేసు కోవడంతో ఆయన స్థానంలో మండలిలో సీనియర్ సభ్యుడిని ప్రొటెమ్ చైర్మన్‌గా నియమించనున్నారు. నూతన ప్రొటెమ్ చైర్మన్‌గా రాజేశ్వర్ పేరు ఖరారైనట్లు సమాచారం. అయితే ఆయన్ను నామినేట్ చేయడానికి సంబంధించి మంగళవారం రాత్రి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
Comments
Please login to add a commentAdd a comment