సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. తాజాగా నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి పార్టీ సీనియర్లలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు.
సోమవారం పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు తండు సైదులు గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి తదితరుల నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో ఆత్మీయ సభ నిర్వహించారు. తప్పుడు సర్వేలతో కంచర్ల తనకు లేని బలాన్ని ఉన్నట్లు చూపించుకున్నా రని దుబ్బాక ఆరోపించారు. కంచర్లను పోటీలో ఉంచితే, కాంగ్రెస్ తేలిగ్గా గెలుస్తుందని, ఆయనను తప్పించి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించి తీరుతామని పేర్కొన్నారు. ఎప్పటి నుంచో ఒకే సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్ ఇస్తున్నారని, ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment