మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, చిత్రంలో ఇన్‌చార్జ్ కలెక్టర్ చంద్రశేఖర్
సాక్షి, నల్లగొండ: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఎన్నో విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టిన డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివని ఇన్‌చార్జ్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యాదినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో సమగ్ర విద్యావిధాన రూపకల్పనకు పునాదులు వేశారన్నారు. మౌలానా అబుల్ కలాం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం.. పేద మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యనందించేందుకు గురుకుల పాఠశాలలు నెలకొల్పినట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం స్వాతంత్య్ర సమరయోధుడుగా, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశం కోసం ఎంతగానో శ్రమించారన్నారు.
మైనార్టీ గురుకుల పాఠశాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం 8 ఎకరాలు భూమి కేటాయించినట్లు.. గురుకుల పాఠశాలకు శాశ్వత బిల్డింగ్‌కు ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో మైనార్టీ విద్యార్థినీ విద్యార్థులు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ జగదీశ్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సుభద్ర, జిల్లా మత్స్యశా>ఖ అధికారి చరిత, మైనార్టీ జూని యర్ కళాశాల ప్రిన్సిపాల్ మునీరుద్దీన్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బుర్ఖాన్, రీజినల్ కోఆర్డినేటర్ జమీల్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అహ్మద్ ఖలీం, కార్యదర్శి హాషం, టీఆర్‌ఎస్ నాయకులు బషీర్, జెడ్పీకోఆప్షన్ సభ్యులు జాన్ శాస్త్రి పాల్గొన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో జాతీయ విద్యాదినోత్సవాన్ని నిర్వహించారు. అబుల్‌కలాం చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment