సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు బీఆర్‌ఎస్ నేతలను ప్రభుత్వ కార్పొరేషన్లకు చైర్మ న్లుగా నియమిస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డిని తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమించారు. సంస్థ డెరెక్టర్లుగా హైదరా బాద్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్, నారాయణ్ పేట్ జిల్లా మద్దూర్ మండలం రెనెవట్లకు చెందిన మొహమ్మద్ సలీం నియమితులయ్యారు.
తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమో షన్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా అందోలు ని యోజకవర్గం వట్‌పల్లి మండలం మార్వెల్లి కి చెందిన మఠం భిక్షపతి స్వామిని నియమించారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మొహమ్మద్ తన్వీర్‌ను తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మ న్‌గా నియమిస్తున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే..
♦ వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు నేతలకు ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా నియమించారు. పటాన్‌చెరుకి చెందిన మాజీ ఎమ్మెల్సీ వి.భూ పాల్‌రెడ్డి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. 2007 నుంచి 2022 మధ్యకాలంలో వరుసగా మూడు పర్యా యాలు మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన 2021 జూన్ 4 నుంచి 2022 జనవరి 3 వరకు శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
♦ అందోలు నియోజకవర్గం వట్‌పల్లికి చెందిన మఠం భిక్షపతి స్వామి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతిలో క్రియాశీలంగా పనిచేశారు. సంగారెడ్డి జిల్లాలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న లింగాయత్ కోటాలో భిక్షపతికి కార్పొరేషన్ పదవి దక్కింది.
♦ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కుమారుడు తన్వీర్‌కు స్థానిక ఉన్న సామాజికవర్గం లెక్కలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ పదవి అప్పగించారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరగా.. ఎమ్మెల్సీ పదవి అప్పగించారు. పదవీకాలం పూర్తయిన తర్వాత అనారోగ్యంతో ఫరీదుద్దీన్ మరణించడంతో ఇటీవల ఆయన కుమారుడు తన్వీర్‌ను మైనారిటీ కమిషన్ సభ్యుడిగా నియమించగా, తాజాగా టీఎస్‌ఐడీసీ చైర్మన్ పదవి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment