State Finance Commission
-
సంగారెడ్డి నేతలకు సీఎం కేసీఆర్ పదవుల పందేరం.. వ్యూహాత్మకమా?
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వ కార్పొరేషన్లకు చైర్మ న్లుగా నియమిస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డిని తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమించారు. సంస్థ డెరెక్టర్లుగా హైదరా బాద్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్, నారాయణ్ పేట్ జిల్లా మద్దూర్ మండలం రెనెవట్లకు చెందిన మొహమ్మద్ సలీం నియమితులయ్యారు. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమో షన్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా అందోలు ని యోజకవర్గం వట్పల్లి మండలం మార్వెల్లి కి చెందిన మఠం భిక్షపతి స్వామిని నియమించారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మొహమ్మద్ తన్వీర్‌ను తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మ న్గా నియమిస్తున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే.. ♦ వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు నేతలకు ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా నియమించారు. పటాన్చెరుకి చెందిన మాజీ ఎమ్మెల్సీ వి.భూ పాల్‌రెడ్డి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. 2007 నుంచి 2022 మధ్యకాలంలో వరుసగా మూడు పర్యా యాలు మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన 2021 జూన్ 4 నుంచి 2022 జనవరి 3 వరకు శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ♦ అందోలు నియోజకవర్గం వట్‌పల్లికి చెందిన మఠం భిక్షపతి స్వామి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతిలో క్రియాశీలంగా పనిచేశారు. సంగారెడ్డి జిల్లాలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న లింగాయత్ కోటాలో భిక్షపతికి కార్పొరేషన్ పదవి దక్కింది. ♦ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కుమారుడు తన్వీర్‌కు స్థానిక ఉన్న సామాజికవర్గం లెక్కలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ పదవి అప్పగించారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం బీఆర్ఎస్లో చేరగా.. ఎమ్మెల్సీ పదవి అప్పగించారు. పదవీకాలం పూర్తయిన తర్వాత అనారోగ్యంతో ఫరీదుద్దీన్ మరణించడంతో ఇటీవల ఆయన కుమారుడు తన్వీర్‌ను మైనారిటీ కమిషన్ సభ్యుడిగా నియమించగా, తాజాగా టీఎస్ఐడీసీ చైర్మన్ పదవి అప్పగించారు. -
పంచాయతీలు బతికేదెట్లా?
- రాష్ట్ర బడ్జెట్ నుంచి స్థానిక సంస్థలకు నిధులివ్వని సర్కారు - కేంద్రం నేరుగా ఇచ్చిన నిధులపైనా ఆంక్షలు - ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రోత్సాహకాలు - సీనరేజీ, స్టాంపు డ్యూటీల్లో వాటాలూ ఇవ్వలేదు - అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయంటున్న సర్పంచులు - రోజువారీ కార్యక్రమాలకూ నిధుల్లేవని ఆందోళన - పరిస్థితి ఇలాగే ఉంటే ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితి దయనీయంగా మారింది. కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టలేకపోవడమే కాదు.. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ వంటి వాటికీ నిధుల్లేని దుస్థితి నెలకొంది. రెండున్నరేళ్లుగా స్థానిక సంస్థలకు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎటువంటి నిధులు ఇవ్వకపోవడంతోపాటు గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా వచ్చే ఆర్థిక సంఘం నిధులపైనా ఆంక్షలు పెట్టడమే దీనికి కారణం. స్థానిక సంస్థలకు బడ్జెట్ కేటారుుంపులపై సలహాలు, సూచనలివ్వాల్సిన రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ)ను రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా సుప్తచేతనావస్థలోనే ఉంచిందంటేనే పరిస్థితి ఏమిటో అర్థమవుతోందని సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీల సంఘాలు పేర్కొంటున్నాయి. స్పందించకుంటే ఉద్యమమే! రెండున్నరేళ్లుగా పంచాయతీలకు నయాపైసా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రమిచ్చే నిధులను చూపి గ్రామజ్యోతి పేరిట ఓ అభూత కల్పనను ప్రజల ముందుకు తెచ్చిందని పంచాయతీరాజ్ చాంబర్ ఆరోపిస్తోంది. పంచాయతీల్లో కేరళ తరహా పాలన తెస్తామంటున్న పాలకులు... ఆ రాష్ట్రంలో మాదిరిగానే స్థానిక సంస్థలకు బడ్జెట్లో 40శాతం నిధులు కేటారుుంచేలా చూడాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునేందుకు వీలుగా ట్రెజరీల్లో ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ‘చలో అసెంబ్లీ’ పేరిట భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఎన్నో సమస్యల్లో పంచాయతీలు ఈ ఏడాది ఆర్థిక సంఘం నిధుల్లో తొలివిడతగా కేంద్రం రూ.401 కోట్లను కేటారుుంచింది. కానీ ఆ నిధులు విడుదల కాకుండా ట్రెజరీల్లో ఫ్రీజింగ్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవమైన 460 గ్రామ పంచాయతీలకు పారితోషికాలు ఇంతవరకూ విడుదల చేయలేదు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ గ్రామ పంచాయతీలకు విడుదల చేయలేదు. సీనరేజీ, స్టాంపుడ్యూటీల్లో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు అందాల్సిన వాటాను కూడా ఇవ్వలేదు. ఇక స్థానిక సంస్థలకు రాష్ట్ర బడ్జెట్లో 40శాతం కేటారుుస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. అసలు ప్రజాప్రతినిధులకు నెలనెలా రావాల్సిన వేతనాలకు సంబంధించి ఆరు నెలల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. పంచాయతీల్లో జారుుంట్ చెక్‌పవర్‌ను రద్దు చేసి.. సర్పంచులకు మాత్రమే చెక్‌పవర్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పునూ నేటికీ అమల్లోకి తీసుకురాలేదు. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేసినా.. చైర్మన్‌ను, సభ్యులను నియమించలేదు. గత ఎనిమిదేళ్లుగా గ్రామ పంచాయతీల్లో పేరుకుపోరుున విద్యుత్ బిల్లులు రూ.1,050 కోట్లను ప్రభుత్వమే చెల్లించాలని సర్పంచులు మొత్తుకుంటున్నా స్పందించడం లేదు. పంచాయతీల్లో స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం వలన అభివృద్ధి కార్యక్రమాలపై పర్యవేక్షణకు వీల్లేకుండా పోరుుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమించిన 29 అధికారాలను.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ బదలారుుంచ లేదు. నిధులపై ఆంక్షలు ఎత్తివేయాలి ‘‘గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులున్నా.. వాటిని వాడుకునేందుకు వీల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా నియంత్రణ (ఫ్రీజింగ్) పెట్టడం దురదృష్టకరం. గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నందున వెంటనే ట్రెజ రీల్లో ఆంక్షలు ఎత్తివేయాలి. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులను నియమించకపోవడం వలన గ్రామాలకు సక్రమంగా నిధులు వచ్చే పరిస్థితి లేదు. కనీసం ప్రజలు చెల్లించిన ఆస్తిపన్నును వినియోగించుకునేందుకు కూడా ప్రభుత్వం వీలు కల్పించకపోవడం బాధాకరం..’’ - మెంటేపల్లి పురుషోత్తం, రాష్ట్ర సర్పంచుల సంఘం కన్వీనర్ తప్పించుకు తిరగాల్సి వస్తోంది ‘‘ఎన్నికై మూడేళ్లు దాటినా సర్పంచులు గ్రామాల్లో ఒక్క అభివృద్ధి పనీ చేయలేని పరిస్థితి ఉంది. దీంతో ప్రజలకు ముఖం చూపించలేక తప్పించుకు తిరగాల్సిన దుస్థితి. రాష్ట్ర బడ్జెట్లో 40 శాతం నిధులను నేరుగా పంచాయతీలకు కేటారుుస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. రాజ్యాంగం పంచాయతీలకు కల్పించిన అధికారాలను ప్రభుత్వాలు ఇంకా బదలారుుంచకపోవడంతో... పంచాయతీల పాలనలో ఎమ్మెల్యేల జోక్యం పెరిగింది. ఎమ్మెల్యేల ఆదేశాలకే అధికారులు ప్రాధాన్యత ఇస్తుండడంతో గ్రామసభల్లో నిర్ణయాలకు విలువ లేకుండా పోతోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా త్వరలో ‘చలో అసెంబ్లీ’ చేపడతాం..’’ - చింపుల సత్యనారాయణరెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు -
అభివృద్ధి ఎలా
జిల్లా పరిషత్‌కు ప్రభుత్వ గ్రాంట్లు తగ్గిపోతున్నాయి. అభివృద్ధిపై ఆప్రభావం పడుతోంది. ప్రభుత్వం నుంచి తలసరి ఆదాయం గ్రాంటు తప్ప మరొకటి రావడం లేదు. స్థానికంగా వచ్చే సీనరేజి, సర్‌చార్జి ఆదాయంపైనే జెడ్పీ ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోదు. ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉండడం లేదు. దీంతో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులపైనే ఆశలు పెట్టుకోవాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: గతంలో కేంద్రప్రభుత్వం నుంచి బీఆర్జీఎఫ్ గ్రాంట్లు వచ్చేవి. ఏటా రూ.26 కోట్లు నిధులు విడుదలయ్యేవి. వాటి ద్వారా జిల్లాలో కొత్త నిర్మాణాలతో పాటు అసంపూర్తిగా ఉండిపోయిన నిర్మాణ పనుల్ని చేసేందుకు అవకాశం ఉండేది.ఇప్పుడా గ్రాంటు నిలిచిపోయింది. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడంతో దాని పరిధిలో గల బీఆర్జీఎఫ్ కూడా ఆగిపోయింది. దీంతో ఏటా రూ.26కోట్ల మేర జెడ్పీ కోల్పోవలసి వస్తోంది. ఆగిపోయిన 14వ ఆర్థిక సంఘం నిధులు జిల్లా పరిషత్‌కు ఆర్థిక సంఘం నిధులు కూడా భారీగా వచ్చేవి. 13వ ఆర్థిక సంఘం అమలైనంతవరకు నిధులొచ్చాయి. కానీ 14వ ఆర్థిక సంఘం వచ్చేసరికి నిధుల విడుదలకు కేంద్రం బ్రేకులేసింది. ఏటా రూ.25నుంచి 30కోట్లు వరకు విడుదలయ్యేవి. వీటితో సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణతో పాటు సీసీ రోడ్లు, అగ్రి, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. అయితే, ఈసారి పంచాయతీలకు సుమారు రూ.25కోట్లు విడుదల చేసి కేంద్రం, జెడ్పీకి ఇప్పటికి ఒక్క పైసా విడుదల చేయలేదు. విడుదల చేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతవరకు జెడ్పీకి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణపై జెడ్పీ సందిగ్ధంలో పడింది. ఇక, మౌలిక సదుపాయాల కల్పన, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాల పరిస్థితి అగమ్యగోచరమే.మానవ వనరుల్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాజీవ్ గాంధీ స్వశక్తి కిరణ్ అభియాన్ పథకం కింద జెడ్పీకి సరాసరి రూ.2కోట్లు విడుదలయ్యేవి. అలాగే, మండల పరిషత్‌లకు రూ.10 లక్షల చొప్పున విడుదలయ్యేది. ఇప్పుడా పథకానికి కూడా కేంద్రం మంగళం పాడేసింది. ముఖ్యంగా శిక్షణా కార్యక్రమాలకు దోహదపడే కేంద్రాల నిర్మాణాలకు బ్రేక్ పడింది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులూ అనుమానమే స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్ఎఫ్సీ) కింద ప్రతి ఏడాది రూ.2కోట్ల వరకు నిధులొచ్చేవి. వీటిని కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు, పాత నిర్మాణాల నిర్వహణను వినియోగించే వారు. గత ఏడాదిగా ఎస్ఎఫ్సీ గ్రాంటు రాలేదు. దానిపై ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. దాదాపు ఆగిపోయినట్టేనని తెలుస్తోంది. దీంతో జెడ్పీకి పాత నిర్మాణాల నిర్వహణ సమస్యగా మారనుంది. జనరల్ నిధులే ఆధారం నాలుగు రకాల గ్రాంట్లు నిలిచిపోవడంతో జెడ్పీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. ప్రభుత్వం నుంచి ప్రస్తుతం తలసరి ఆదాయం గ్రాంటు మాత్రమే వస్తోంది. ఒక వ్యక్తికి రూ.4 చొప్పున సుమారు రూ.93 లక్షలు వస్తోంది. సర్‌చార్జీ ద్వారా సుమారు రూ.50 లక్షల నుంచి 70 లక్షల వరకు, సీనరేజీ ద్వారా దాదాపు రూ.కోటి వరకు వస్తోంది. ఇవన్నీ జనరల్ ఫండ్స్ కిందకొస్తాయి. ఈ ఆదాయం రూ.3 కోట్ల లోపే ఉంటుంది. ఈ మొత్తంతో జిల్లా వ్యాప్తంగా ఎంత మేర అభివృద్ధి చేయవచ్చన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీంతో అభివృద్ధికి కల్ప తరువుగా ఉపాధి హామీ పథకమే కన్పిస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ పథకమైనప్పటికీ జెడ్పీ తీర్మానం ద్వారా ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనుల్ని ప్రతిపాదిస్తుండటంతో అదే జెడ్పీ గొప్పతనంగా చెప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడా పనుల కోసమే అధికార పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. విపక్షాల పంచాయతీలకు కేటాయింపులు చేయకుండా ఏకపక్షంగా మంజూరు చేయించుకుంటున్నారు.