చుక్కా రామయ్యకు ప్రొటెమ్‌ చైర్మన్‌ పరామర్శ | Telangana Protem Chairman Bhupal Reddy Visit to Chukka Ramaiah | Sakshi
Sakshi News home page

చుక్కా రామయ్యకు ప్రొటెమ్‌ చైర్మన్‌ పరామర్శ

Published Thu, Sep 23 2021 9:10 AM | Last Updated on Thu, Sep 23 2021 10:58 AM

Telangana Protem Chairman Bhupal Reddy Visit to Chukka Ramaiah - Sakshi

చుక్కా రామయ్య ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యుడు చుక్కా రామయ్యను శాసనమండలి ప్రొటెమ్‌ చైర్మన్‌ భూపాల్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. మాజీ ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డితో కలిసి విద్యానగర్‌లోని రామయ్య నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో తన సొంత నిధులతో నిర్మించిన గీతాభూపాల్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీని సందర్శించాల్సిందిగా భూపాల్‌రెడ్డి కోరారు. నేటితరం విద్యార్థులకు రామయ్య వంటి విద్యావేత్త మార్గదర్శనం అవసరముందని వ్యాఖ్యానించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement