VJ Sunny's 'Sound Party' poster released at the hands of MLC Kavitha - Sakshi
Sakshi News home page

Sound Party Movie: వీజే స‌న్నీ 'సౌండ్ పార్టీ'.. పోస్టర్ రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ కవిత

Published Fri, Aug 4 2023 9:23 PM | Last Updated on Sat, Aug 5 2023 9:57 AM

VJ Sunny Sound Party poster released at the hands of MLC Kavitha - Sakshi

వీజే స‌న్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’.  నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ.  సంజ‌య్ శేరి ద‌ర్శ‌కత్వంలో  రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం ఇటీవ‌ల షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత రిలీజ్ చేశారు. 

ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ...'సౌండ్ పార్టీ టైటిల్, పోస్ట‌ర్ ఎంతో ఇంట్ర‌ెస్టింగ్‌గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంటర్‌టైన్‌ చేయనుందని టైటిల్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు , చిత్రబృందానికి మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా.' అని అన్నారు.

(ఇది చదవండి:83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్‌.. ఇప్పుడు ఏకంగా!)

నిర్మాత ర‌వి పోలిశెట్టి  మాట్లాడుతూ..' ఫుల్  మూన్ మీడియా ప్రొడక్షన్స్‌లో వ‌స్తోన్న మొద‌టి సినిమా `సౌండ్ పార్టీ` పోస్ట‌ర్‌ను ఎమ్మెల్సీ క‌విత లాంఛ్ చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సౌండ్ పార్టీ టైటిల్‌కు రెస్పాన్స్ బాగా వచ్చింది. మా యూనిట్ అంతా ఎంతో శ్ర‌మించి అద్భుతంగా చిత్రాన్ని తెర‌కెక్కించారు. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం.'అని అన్నారు. హీరో వీజే స‌న్ని మాట్లాడుతూ...' ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టైటిల్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. షూటింగ్ అంతా పూర్త‌యింది. సినిమా అనుకున్న దానిక‌న్నా చాలా బాగొచ్చింది' అన్నారు.

ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ...'సౌండ్ పార్టీ' పోస్ట‌ర్‌ను కవిత లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయని' అన్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి,  పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

(ఇది చదవండి: స్టార్ హీరోతో డేటింగ్‌లో లైగర్ భామ.. స్పందించిన హీరోయిన్ తండ్రి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement