Dil Raju And Yash's 'Aakasham Daati Vastava' Movie Title Poster Released - Sakshi
Sakshi News home page

‘బలగం’ తర్వాత కొరియోగ్రాఫర్‌ యష్‌తో సినిమా.. ఈ కారణంతోనే అవకాశం: దిల్‌ రాజు

Published Tue, Jul 25 2023 6:40 AM | Last Updated on Tue, Jul 25 2023 10:41 AM

Dil Raju And Yash Aakasham Daati Vastava Movie Title poster release - Sakshi

'ఆకాశం దాటి వస్తావా’ మంచి మ్యూజికల్‌ మూవీ. కొత్త ప్రతిభని పరిచయం చేయాలనే దిల్‌ రాజు ప్రొడక్షన్‌ బ్యానర్‌లో శశి, యష్‌లతో ఈ యూత్‌ఫుల్‌ సినిమా చేస్తున్నాం' అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. కొరియోగ్రాఫర్‌ యష్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశి కుమార్‌ ముతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కార్తీక మురళీధరన్‌ హీరోయిన్‌. ‘దిల్‌’ రాజుప్రొడక్షన్‌ బ్యానర్‌లో ‘బలగం’ తర్వాత హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్, పోస్టర్‌ని విడుదల చేశారు.

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– 'నా సినిమాలో కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇస్తానని యష్‌తో అన్నాను. కానీ లుక్‌ పరంగా బాగున్నాడు. అందుకే హీరోగా పరిచయం చేస్తున్నాం. సింగర్‌ కార్తీక్‌ ఈ సినిమా ద్వారా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు' అన్నారు. 'జీవితంలో అన్ని బంధాలకు ప్రేమ, టైమ్, డబ్బులను సమానంగా ఇవ్వాలి. ఈ మూడింటిలో ఏది తగ్గినా ఆ బంధంలో గొడవలు జరుగుతాయి. ఇదే ΄పాయింట్‌తో ఈ సినిమా కథ సాగుతుంది' అన్నారు శశి కుమార్‌ ముతులూరి. 'నన్ను నమ్మి హీరోగా అవకాశం ఇచ్చినందుకు ‘దిల్‌’ రాజు, శశి, హర్షిత్, హన్షితగార్లకు థ్యాంక్స్‌' అన్నారు యష్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement