నాగశౌర్య హీరోగా రంగబలి, స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ | Naga Shaurya Rangabali gets a release date fix | Sakshi
Sakshi News home page

నాగశౌర్య హీరోగా రంగబలి, స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌

Published Fri, May 12 2023 3:49 AM | Last Updated on Fri, May 12 2023 8:00 AM

Naga Shaurya Rangabali gets a release date fix - Sakshi

నాగశౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగబలి’. ఈ చిత్రం ద్వారా పవన్‌ బాసంశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ‘రంగబలి’ని జూలై 7న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. నాగశౌర్య ట్రెండీ గెటప్‌లో కనిపిస్తున్న ఓ పోస్టర్‌ ద్వారా రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేశారు.

‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే కథతో ‘రంగబలి’ ఫన్‌ రైడ్‌ (సరదా ప్రయాణం) గా ఉండబోతోంది. ఇందులో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.. ఇందుకు ప్రత్యేకంగా మేకోవర్‌ అయ్యారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. హీరోయిన్, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: పవన్‌ సీహెచ్, కెమెరా: దివాకర్‌ మణి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement