మెడికల్‌ థ్రిల్లర్‌ ‘ఏ’ టైటిల్‌ పోస్టర్‌ ఇదుగో! | Medical Thriller A Telugu Movie Title Poster Out | Sakshi
Sakshi News home page

మెడికల్‌ థ్రిల్లర్‌ ‘ఏ’ టైటిల్‌ పోస్టర్‌ ఇదుగో!

Published Fri, May 1 2020 2:26 PM | Last Updated on Fri, May 1 2020 2:26 PM

Medical Thriller A Telugu Movie Title Poster Out - Sakshi

నితిన్‌ ప్రసన్న, ప్రెజర్‌ కుక్కర్‌ ఫేం ప్రీతీ అశ్రాని ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఏ’. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసిన యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సస్పెన్స్‌ మెడికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. టైటిల్‌ పోస్టర్‌ డిఫరెంట్‌గా ఉండటంతో చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

టైటిల్‌ పోస్టర్‌ విడుదల సందర్భంగా దర్శకుడు ముని మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథాంశం చాలా అనుహ్యమైనది , ఇప్పటివరకు ప్రపంచ సినిమాల్లో కూడా రానటువంటి ఒక విభిన్నమైనటువంటి కథ. 1977 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కథ నడుస్తుంది. దర్శకునితో సహా మిగిలిన టెక్నిషన్స్ అందరూ కూడా ఫిల్మ్ స్కూల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్లు కావటం తో సినిమా టెక్నికల్ గా అద్భుతంగా వచ్చింది. 

నటీనటుల కోసం దాదాపు నాలుగు నెలల్లో  300 కి పైగా ఆడిషన్స్ చేశాం. ఖచ్చితంగా థ్రిల్లర్ జానర్ ప్రేక్షకులకు ఒక క్రొత్త అనుభూతిని మరియూ సంతృప్తి ని ఇస్తుంది. మేకింగ్ విషయం లో ఎక్కడా కాంప్రమైస్ అవ్వకుండా శంషాబాద్ దగ్గర్లో ఒక సెట్ ను నిర్మించి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం’అని అన్నారు. జబర్దస్త్‌ బేబీ దీవెన, రంగాథం, కృష్ణవేణి, భరద్వాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని అవంతికి ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement