ఆ మైలురాయిని చేరుకుంటాం | Eagle Released on 9th February: TG Vishwaprasad | Sakshi
Sakshi News home page

ఆ మైలురాయిని చేరుకుంటాం

Published Sun, Feb 4 2024 12:56 AM | Last Updated on Sun, Feb 4 2024 12:56 AM

Eagle Released on 9th February: TG Vishwaprasad - Sakshi

‘‘మా బ్యానర్‌లో వంద సినిమాలను త్వరితగతిన పూర్తి చేయాలనే మా మిషన్‌ ఆన్‌లోనే ఉంది. మా నిర్మాణ సంస్థ నుంచి ఈ ఏడాది కనీసం 15 సినిమాలు విడుదల కావొచ్చు. రవితేజగారి ‘మిస్టర్‌ బచ్చన్‌’, శర్వానంద్, శ్రీ విష్ణు సినిమాలు ఈ ఏడాదే విడుదలవుతాయి. నాలుగు సినిమాలు అమెరికాలో చేస్తున్నాం. ప్రభాస్‌గారి ‘రాజా సాబ్‌’ సినిమా రిలీజ్‌ గురించి త్వరలోనే చెబుతాం. అలాగే ఈ ఏడాది మా సంస్థలో 50వ చిత్రం మైలురాయిని అందుకుంటామనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌. రవితేజ హీరోగా నటించిన యాక్షన్‌ చిత్రం ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.

ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘ఈగల్‌’ను 2023 డిసెంబరు చివరి వారంలో విడుదల చేద్దామనే ఆలోచన చేశాం. అయితే ఆ తర్వాత ప్రభాస్‌ ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ రిలీజ్‌ కన్ఫార్మ్‌ కావడంతో ‘ఈగల్‌’ను సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయాలనుకున్నాం. కానీ తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రిక్వెస్ట్, పరిశ్రమ మేలుని దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 9కి వాయిదా వేశాం. ఈ టైమ్‌కి ‘యాత్ర 2’ కూడా వస్తోంది. కానీ ఆ సినిమా డిఫరెంట్‌. ఏ సినిమా రీచ్‌ ఆ సినిమాకు ఉంటుంది. ‘ఈగల్‌’ క్లాసిక్‌ అండ్‌ స్టయిలిష్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌. రవితేజగారు కొత్తగా కనిపిస్తారు. కథ, మెసేజ్, యాక్షన్, సాంగ్స్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement