శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ అన్నారు. శ్రీకాకుళంలోని ఇందిరావిజ్ఞానభవన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి కృషిచేసిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. అటువంటి పార్టీలో తనను పీసీసీ ఉపాధ్యక్షునిగా నియమించడం గర్వకారణమన్నారు. వివిధ కారణాలతో 2014లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా 2015లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గెలుపు సాధించి శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు.
2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ సత్తాను చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు డోల జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ పీసీసీ ఉపాధ్యక్షునిగా పీరుకట్లకు పార్టీ సముచిత స్థానం కల్పించడం అభినందనీయమన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రత్నాల నరసింహమూర్తి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి సతీష్, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు నంబాళ్ల రాజశేఖర్, బీసీసెల్ రాష్ట్ర కన్వీనర్ సనపల అన్నాజీరావు, ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ గంజి ఎజ్రా, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బాన్న రాము, పట్టణ అధ్యక్షుడు పుట్టా అంజనీకుమార్, పార్టీ నాయకులు ఎం.ఎ.బేగ్, అల్లిబిల్లి రాధ, కె.ఎల్.ఈశ్వరి, కొంక్యాణ మురళీధర్, తైక్వాండో శ్రీను, వైశ్యరాజు మోహన్, డి.త్రినాధరావు పాల్గొన్నారు.
కాంగ్రెస్ బలోపేతానికి కృషి
శ్రీకాకుళం అర్బన్: కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవానికి అనుబంధ విభాగాల ప్రతినిధులు కృషిచేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బీసీ విభాగం రాష్ట్ర చైర్మన్ ఎం. వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మన్ కొరివి వినయ్‌కుమార్, ఎస్టీ విభాగం రాష్ట్ర చైర్మన్ కె. సుధాకర్, ఏపీ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ ముస్తాక్ మహ్మద్‌లు కోరారు. బుధవారం స్థానిక ఇందిర విజ్ఞాన్ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డోల జగన్ అధ్యక్షతన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాష్ట్ర చైర్మన్‌ల అనుబంధ విభాగాల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలనే అమలు జరుపుతున్నారు తప్ప కొత్తగా ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదన్నారు. సమావేశంలోరాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్‌చార్జి చౌదరి సతీష్, రాష్ట్ర కమిటీ కన్వీనర్ గంజి ఆర్ ఎజ్రా (ఎస్సీ, ఎస్టీ విభాగం), బీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్ సనపల అన్నాజీరావు, అనుబంధ విభాగాల చైర్మన్ (బీసీ), నంబాళ్ల రాజశేఖర్, (ఎస్సీ) బాన్న రాము, (మైనారిటీ) బి.కోటేశ్వరరావు, (ఎస్టీ) బిడ్డిక శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాం
Published Thu, Dec 31 2015 12:08 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement