కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన్ననలు పొంది పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవి దక్కించుకొని తొలిసారిగా
ఆమదాలవలస:కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన్ననలు పొంది పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవి దక్కించుకొని తొలిసారిగా జిల్లాకు ఆదివారం వచ్చిన ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌కు శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలసలో ఘన స్వాగతం లభించింది. ఆ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రైల్వేస్టేషన్‌కు చేరుకొని ఆయన వచ్చిన విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం గంటల తరబడివేచి ఉన్నారు. రైలు రాగానే పీరుకట్లను చుట్టుముట్టి పూలదండలు, బొకేలతో ముంచెత్తి అభినందనలు తెలిపారు.
ఆమదాలవలసకు చెందిన డీసీసీ జిల్లా కార్యదర్శి సనపల అన్నాజీరావు తొలుత ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు పీరుకట్ల సీతబాబు, కాంగ్రెస్ నాయకులు పి.వి.విశ్వప్రభాకరరావు, జె.అప్పలస్వామినాయుడు, కె.కృష్ణంనాయుడు, బెవర సంఘం నాయుడు, సీపాన గోవిందరావు, మామిడి మల్లేసు, అడపా వాసుదేవరావు, అన్నెపు సూర్యనారాయణ, దన్నాన శ్రీరామ్మూర్తి, బగాది నారాయణమూర్తి, కొంచాడ రాము, సువ్వారి నేతాజీతో పాటు సుమారు 300 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.