సాక్షి, శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ పార్టీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జిల్లాలో జాతీయ కాంగ్రెస్‌తోపాటు బీజేపీ అభ్యర్థులు ఘోర పరాజ యాలను ఎదుర్కొన్నారు. ఆ రెండు పార్టీల అభ్యర్థులు దాదా పుగా అన్ని నియోజకవర్గాల్లోను డిపాజిట్ల(ధరావతును)ను కోల్పోయారు. విశేషం ఏంటంటే ఈ రెండు పార్టీల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులకు నోటాకు నమోదైన ఓట్లు కూడా సాధించకపోవడం విశేషం. చాలా చోట్ల నోటాలో కనీసం మూడోవంతు ఓట్లను కూడా దక్కించుకోలేకపోయారు. కేంద్రంలో బీజేపీ పూర్తి హవా కనబర్చినప్పటికీ రాష్ట్రంలో, శ్రీకాకుళం జిల్లాలో ఘోర పరాభవం ఎదురైంది.
జిల్లాలో జాతీయ పార్టీలు సాధించిన ఓట్ల వివరాలు..
నియోజకవర్గం | కాంగ్రెస్ అభ్యర్థి | పోలైన ఓట్లు | బీజేపీ అభ్యర్థి | పోలైన ఓట్లు |
పలాస | మజ్జి శారద | 1731 | కొర్రాయి బాలకృష్ణ | 1337 |
ఇచ్ఛాపురం | కొల్లి ఈశ్వరరావు | 2044 | జెఎస్ ప్రసాదరావు | 1651 |
నరసన్నపేట | డోల ఉదయ్‌భాస్కరరావు | 5235 | రెడ్డి భాగ్యలక్ష్మి | 758 |
ఆమదాలవలస | బొడ్డేపల్లి సత్యవతి | 961 | పాతిన గడ్డెయ్య | 850 |
పాతపట్నం | రాము | 1206 | ఎస్.రాఘవరావు | 1011 |
ఎచ్చెర్ల | కె.సింహాద్రినాయుడు | 2113 | ఆర్. సూర్యప్రకాశరావు | 984 |
టెక్కలి | చింతాడ దిలీప్‌కుమార్ | 1948 | హెచ్ ఉదయ్‌భాస్కర్ | 773 |
శ్రీకాకుళం | చౌదరి సతీష్ | 2223 | చల్లా వెంకటేశ్వరరావు | 1319 |
రాజాం | కంబాల రాజవర్దన | 2195 | ఎం.చైతన్యకుమార్ | 924 |
పాలకొండ | హిమరక ప్రసాద్ | 994 | తాడంగి సునీత | 1121 |
Comments
Please login to add a commentAdd a comment