‘గూఢచారి, కార్తికేయ 2, వెంకీ మామ, ఓ బేబీ, ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్, చైర్మన్ టీజీ విశ్వప్రసాద్ హైదరాబాద్, బెంగళూరులో ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ అకాడమీ’ని ఆరంభించారు. ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సినిమా రంగంలో రాణించాలనుకునే నేటి యువతకి మేం ఉన్నామని భరోసా ఇస్తూ ఉచిత శిక్షణ కల్పించి, ప్రతిభావంతులుగా ఇండస్ట్రీకి పరిచయం చేయడమే ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ అకాడమీ’ ప్రధాన లక్ష్యం.
చైర్‌ఉమెన్ టీజీ వందనా ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి శిక్షణతోపాటు భావితరాలకి మంచి భవిష్యత్తు అందించడానికి దిశా నిర్దేశంగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ అకాడమీ’ అడుగులు వేస్తుంది. స్టూడెంట్స్‌కు రియల్‌ప్రాజెక్టులపై పని చేసే అవకాశం కల్పించడంతోపాటు, సెలెక్ట్ అయిన స్టూడెంట్స్‌కు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ ఫిల్మ్ కోర్సులు పూర్తి ఉచితంగా శిక్షణ ఇస్తాం. యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్, మేకప్, కాస్ట్యూమ్స్, డిజైనింగ్, వర్చ్యువల్ ప్రోడక్షన్– డిఐ, లైటింగ్ విభాగాల్లో శిక్షణ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు 90322 57101 నంబరులో సంప్రదించాలి’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment