![Russian Hackers Targeted NATO, Eastern European Militaries - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/31/Russian-Hackers.jpg.webp?itok=hEL0hsr3)
గత కొన్ని వారాల నుంచి ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంకా, రెండూ దేశాల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. అయితే, ఇలాంటి సమయంలో రష్యా పరోక్షంగా నాటోపై దాడులు చేసేందుకు సిద్ద పడినట్లు సమాచారం. రష్యా హ్యాకర్లు ఇటీవల నాటో నెట్‌వర్క్, కొన్ని తూర్పు ఐరోపా దేశాల సైనిక దళాలలకి చెందిన భద్రత వ్యవస్థపై దాడులు చేసేందుకు ప్రయత్నించారని గూగుల్ థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ బుధవారం ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది.
"కోల్డ్ రివర్/కాలిస్టో" అనే రష్యన్ హ్యకర్ గ్రూప్ ఏ దేశ మిలిటరీని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు అని "Credential Phishing Campaigns" నివేదిక స్పష్టంగా పేర్కొనలేదు. హ్యాకర్లు కొత్తగా క్రియేట్ చేసిన జీమెయిల్ ఖాతాలను ఉపయోగించి నాన్-గూగుల్ ఖాతాలకు ఈ ప్రచారాలను పంపారని, అందువల్ల ఈ ప్రచారాలు ఎంత వరకు విజయవంతం అయ్యాయో అనేది పూర్తిగా తెలియదని ఈ నివేదిక తెలిపింది. ఈ నివేదికపై నాటో ఇంకా స్పందించలేదు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలని రష్యా నిర్ణయం తీసుకున్న తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై భారీగా ఆర్థిక ఆంక్షలు విధించాయి. అయితే, అప్పటి నుంచి పాశ్చాత్య దేశాలపై రోజు రోజుకి పెరుగుతున్న సైబర్ దాడుల ఆరోపణలను ఖండించింది. నాటో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా ఈ బృందం లక్ష్యంగా చేసుకున్నట్లు నాటి గూగుల్ నివేదిక తెలిపింది.
(చదవండి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, భారత్ వృద్ధికి ఇండియా రేటింగ్స్ కోత!)
Comments
Please login to add a commentAdd a comment