సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ విషయంలో ప్రపంచ దేశాలు మాట్లాడకూడదని, జోక్యం చేసుకోకూడదని పుతిన్ అన్ని దేశాలకు ముక్కు సూటిగా చెప్పేశారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌లో రక్తపాతం సృష్టిస్తున్న సందర్బంగా గురువారం రాత్రి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడనున్నారన్న విషయం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది.
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా మరణాహోమాన్ని ఆపడానికి భారత ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆ దేశ రాయబారి ఇగోర్ పోలిఖా.. ప్రధాని మోదీని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో పుతిన్‌తో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. మోదీ మాట్లాడిన తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయోనని అన్ని దేశాలు వేచి చూస్తున్నాయి.
మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో మోదీ లోక్ కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమావేశానికి హోం శాఖ, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రులతో పాటు క్యాబినెట్ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భారతీయుల తరలింపు, ముడి చమురు ధరలపై దీని ఎఫెక్ట్‌పై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment