కీవ్: రష్యా దురాక్రమణకు లోనైన తమ భూభాగాలను తిరిగి దక్కించుకునేందుకు సర్వం ఒడ్డుతున్న ఉక్రెయిన్‌కు మద్దతు పలుకుతున్న దేశాల సంఖ్య పెరుగుతుంది. శనివారం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ ఉక్రెయిన్‌లో పర్యటించారు. నాటో భేటీ కోసం లిథువేనియాకు వచి్చన యూన్ సతీసమేతంగా ఉక్రెయిన్ వెళ్లారు. ఉక్రెయిన్ సేనల తీవ్ర ప్రతిఘటనలతో వెనుతిరుగుతూ రష్యా మూకలు సృష్టించిన నరమేథానికి సాక్షిగా నిలిచిన బుచా, ఇరి్పన్ నగరాల్లోని ఘటనాస్థలాలను యూన్ సందర్శించి మృతులకు నివాళులరి్పంచారు.
యుద్ధంలో తలమునకలైన ఉక్రెయిన్‌కు మానవీయ, ఆర్థికసాయం అందిస్తూ ద.కొరియా తనవంతు చేయూతనందిస్తోంది. కానీ ఆయుధసాయం మాత్రం చేయట్లేదు. యుద్ధంలో మునిగిన దేశాలకు ఆయుధాలు అందించకూడదనే తన దీర్ఘకాలిక విధానాన్ని ద.కొరియా ఇంకా కొనసాగిస్తోంది. అయితే మందుపాతరలను గుర్తించి నిరీ్వర్యంచేసే ఉపకరణాలు, అంబులెన్సులు, సైనికయేతర వస్తువులను మాత్రం అందించేందుకు తమ సమ్మతి తెలిపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ యూన్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. యుద్ధ తీవ్రంకాకుండా ఆపగలిగే పరిష్కార మార్గాలను అన్వేíÙంచాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment