కైవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం ఇంకా సద్దుమణగలేదు. గురువారం తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలోని కాడివ్కాలో కాల్పుల మోత ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. సరిహద్దు ప్రాంతంలో గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో రష్యా మద్దతు కలిగిన వేర్పాటువాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ సైనికుల కూడా ఎదురుకాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఉక్రెయిన్ ప్రభుత్వ బలగాలే తమపై కాల్పులు జరిపినట్లు రష్యా వేర్పాటువాదులు ఆరోపించారు. అయితే ఈ కాల్పుల్లో ప్రాణనష్టం జరగలేదు. కానీ, ఇద్దరు పౌరులు గాయపడినట్టు ప్రాథమిక సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ ఎదురుకాల్పులపై అగ్ర రాజ్యం అమెరికా స్పందించింది. రష్యావి రెచ్చగొట్టే చర్యలు అంటూ ఘాటు వ్యాఖ‍్యలు చేసింది. ఈ క్రమంలో రష్యా.. సరిహద్దుల్లో మోహరించిన తన దేశ సైనికులను వెనక్కి రప్పించినట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment