సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!
ఉక్రెయిన్ కోసం
ప్రజాస్వామ్యంలో బతకాలన్న అతి మామూలు కోరికతో ఒక ఫాసిస్ట్ దురాక్రమణదారుకు వ్యతిరేకంగా నిలబడిన జనానికి నేను మద్దతుగా నిలుస్తున్నాను. జీవితంలోని చాలా విషయాలు అస్పష్టంగా ఉంటాయి. కానీ ఇది మాత్రం కాదు.
– నీరా టాండన్, అమెరికా ఉదారవాది
అహంకార ఉక్రెయిన్
శ్వేత దురహంకార నియో నాజీలతో కూడిన ఉక్రెయిన్ ప్రభుత్వానికి స్వీయాభిమానం ఉన్న ఒక నల్ల జాతీయుడు ఎలా మద్దతివ్వగలడు?
– అజము బరాకా, అమెరికా యాక్టివిస్ట్
వాస్తవం తెలుసుకోండి
ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను తరలించడం భారత ప్రభుత్వ నైతిక బాధ్యత మాత్రమే. అది న్యాయపరమైన బాధ్యత కాదు. ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శించడం మానండి. ఉక్రెయిన్ ఒక సార్వభౌమ దేశం. మనం ఏం చేయగలిగినా వారి అనుమతి, ప్రాథమ్యాలను బట్టే చేయాల్సి ఉంటుంది. ప్రమాదంలో ఉన్న వారి విమానాశ్రయాలను వాడటంలో మనకు ప్రాథమ్యం ఇవ్వమని ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం నైతికంగా డిమాండ్ కూడా చేయలేము.
– ఎన్.సి. ఆస్థానా, మాజీ ఐపీఎస్ అధికారి
ఇంటి సంగతి తెలియదు
నమ్మలేనిదే గానీ ముమ్మాటికీ నిజం. ఇండియాలోని టీవీ న్యూస్ చానల్స్‌కు... మన సరిహద్దు లద్దాఖ్‌లో చైనా సైన్యపు ఉనికి కంటే, ఎక్కడో ఉన్న ఉక్రెయిన్‌లో రష్యా బలగాల మోహరింపు, వారి కదలికల గురించి ఎక్కువ తెలుసు.
– సుశాంత్ సింగ్, సీనియర్ ఫెలో
మీరేం చేశారు?
ఉక్రెయిన్ మీద రష్యా దాడి కచ్చితంగా ఆ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించడమే. ఇది యుద్ధోన్మాద చర్య. కానీ అమెరికా, యూరప్ కూడా ఇటీవలి చరిత్రలో సరిగ్గా ఇలానే వ్యవహరించాయి... ఇరాక్, సిరియా, కొసావో, అఫ్గానిస్తాన్ అన్నింటా ఇదే కథ. ఇరాక్ మీద దాడి చట్టవిరుద్ధం, దానికి ఐక్యరాజ్యసమితి అనుమతి లేదు, పైగా అది ఒక అబద్ధం మీద ఆధారపడి చేసినది. ఉనికిలోనే లేని మానవ హనన ఆయుధాలు అన్న సాకుతో ఆ దాడి జరిగింది.
– మిన్హాజ్ మర్చంట్, రచయిత
నిద్ర పోలేకపోతున్నాం
ఇప్పుడు అర్ధరాత్రి రెండున్నర అవుతోంది. అయినా ఉక్రెయిన్‌లో మేము ఇంకా నిద్ర పోలేకపోతున్నాం.
– ఐరీనా మాత్వియిషీన్, జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment