
కార్తీ
‘ఖాకి, చినబాబు’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత తమిళ హీరో కార్తీ నటిస్తోన్న తాజా చిత్రం ‘దేవ్’. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరప్‌లోని ఉక్రెయిన్‌లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో మొదలైన ఈ షెడ్యూల్‌లో ముందు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ శుక్రవారం ‘దేవ్’ టీమ్‌తో రకుల్ జాయిన్ అవ్వగానే పాట అందుకున్నారు టీమ్. అదే సాంగ్ షూట్ స్టార్ట్ చేశారని చెప్తున్నాం. పాట పూర్తయిన తర్వాత అక్కడి లొకేషన్స్‌లోనే హీరో, హీరోయిన్లలపై కొన్ని సీన్స్‌ను చిత్రీకరిస్తారట. ఇందులో కార్తీక్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేస్తున్నారు. మరో రెండు నెలల్లో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టి ఈ ఏడాది డిసెంబర్‌లో ‘దేవ్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని కోలీవుడ్ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment