అందులో ఉన్న ఆనందం ఏంటో.. పవన్‌కి ప్రకాశ్‌ రాజ్‌ మరోసారి కౌంటర్‌! | Prakash Raj Counter To AP Deputy CM Pawan Kalyan | Sakshi
Sakshi News home page

అందులో ఉన్న ఆనందం ఏంటో.. పవన్‌కి ప్రకాశ్‌ రాజ్‌ మరోసారి కౌంటర్‌!

Published Wed, Sep 25 2024 5:18 PM | Last Updated on Wed, Sep 25 2024 6:12 PM

Prakash Raj Counter To AP Deputy CM Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మరోసారి  కౌంటర్ ఇచ్చాడు. హీరో కార్తీని పవన్ టార్గెట్ చేయడాన్ని తప్పు పడుతూ.. ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్‌ ఆస్కింగ్‌...’ అని ట్వీట్‌ చేశాడు.

(చదవండి: దయచేసి ఆ వీడియోని ఇప్పుడు వాడకండి : యాంకర్‌ రష్మి)

తిరుమల లడ్డు వివాదంపై పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న రాద్ధాంతాన్ని  ప్రకాశ్‌రాజ్ మొదటి నుంచి తప్పుపడుతున్నాడు. ‘జస్ట్‌ ఆస్కింగ్‌’అంటూ పవన్‌ చర్యలను తప్పుపడుతూ ట్వీట్‌ చేశాడు. ప్రకాశ్‌ రాజ్‌ పోస్టులపై పవన్‌ అసహనం వ్యక్తం చేశాడు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్‌ హెచ్చరించారు. దీనిపై ప్రకాశ్‌ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్‌ కల్యాణ్‌ప్రశ్నలకు సమాధానమిస్తానని, ఆలోపు వీలైతే తను చేసిన ట్వీట్స్‌ మళ్లీ ఒకసారి చదవండి’ అంటూ కౌంటర్‌ ఇచ్చాడు. 

కార్తీ వివాదం ఏంటి?
‘సత్యం సుందరం’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో యాంకర్‌ లడ్డు కావాలా అంటూ కార్తిని అడుగుతుంది. దానికి కార్తి నవ్వుతూ.. ‘లడ్డూ అంశం ప్రస్తుతం సున్నితమైంది’ వద్దులే అన్నాడు. ఆయన సరదా అన్నట్లు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం కార్తి వ్యాఖ్యలను తప్పపడుతూ.. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడొద్దని హెచ్చరించాడు. ఈ వివాదం పెద్దది కావొద్దనే ఉద్దేశంతో కార్తి క్షమాపణలు చెబుతూ ట్వీట్‌ చేశాడు. 

పవన్ కు ప్రకాష్ రాజ్ మరుసారి కౌంటర్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement