'భారత్లో ఐటీ విప్లవం మొదలైంది' | PM Narendra Modi's 'Make in India' Pitch at Meeting with Chancellor Angela Merkel | Sakshi
Sakshi News home page

'భారత్లో ఐటీ విప్లవం మొదలైంది'

Published Tue, Oct 6 2015 12:45 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

'భారత్లో ఐటీ విప్లవం మొదలైంది' - Sakshi

'భారత్లో ఐటీ విప్లవం మొదలైంది'

బెంగళూరు : 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యాన్ని సుసాధ్యం చేసి 125 కోట్ల భారతీయుల కలలను నెరవేర్చుతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత పర్యటనలో ఉన్న జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్తో కలిసి ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంగళవారం కర్నాటక వచ్చారు. తమ పర్యటనలో భాగంగా  బెంగళూరులోని బాష్ ఇంజినీరింగ్ సెంటర్ను వీరు సందర్శించారు.

ప్రత్యేక విమానంలో మోదీ, మోర్కెల్లు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో దిగి, అనంతరం బాష్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సుమారు 77వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై మోర్కెల్, మోదీలు సంతకాలు చేయనున్నారు. జర్మనీకి చెందిన పది ప్రముఖ సంస్థలు కర్ణాటకలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.


మోదీ ప్రసంగంలోని అంశాలు:
అంతర్జాతీయ తయారీ కేంద్రంగా భారత్ని తీర్చిదిద్దడం
భారత్-జర్మనీ ఆర్థిక సంబంధాలు స్థిరంగా ఉండాలి
గత 15 నెలలుగా వ్యాపారానికి అణువైనదిగా భారత్ని చేయడానికి తీవ్రంగా కృషిచేశాం
విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన తరుణం.. మంచి అవకాశం
ఇక్కడ భారీగా వస్తువుల, ఉత్పత్తుల తయారీ చేపట్టి 'మేక్ ఇన్ ఇండియా'కి న్యాయం చేస్తాం
జీఎస్టీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాం. వచ్చే ఏడాది నుంచి అమలు చేసే అవకాశం ఉంది.
పరిశ్రలకు కావాల్సిన లైసెన్స్ కాలవ్యవధిని పెంచుతాం
భారత్లో ఐటీ విప్లవం వచ్చింది. 125 కోట్ల భారతీయుల లక్ష్యాలను సాంకేతిక పరిజ్ఞానంతో సాధిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement