
ఏంజెలా మెర్కెల్
న్యూఢిల్లీ: జర్మనీ అధినేత్రిగా నాలుగోసారి ఏంజెలా మెర్కెల్ పగ్గాలు చేపట్టబోతున్నారు. జర్మన్ పార్లమెంటు సభ్యులు బుధవారం మరోసారి దేశ చాన్స్‌లర్‌గా ఏంజెలాను ఎన్నుకున్నారు. ఇది ఆమెకు నాలుగో పర్యాయం. చివరిది అని కూడా భావిస్తున్నారు. 364 సభ్యులు ఉన్న జర్మనీ దిగువ సభలో 315 మంది ఆమెకు ఓటు వేశారు. తొమ్మిది మంది గైర్హాజరయ్యారు. 63 ఏళ్ల ఏంజెలాకు ఈసారి ప్రభుత్వాన్ని కొనసాగించడం అతిపెద్ద సవాలే కానుంది. పెద్దగా తన పార్టీకి పట్టులేని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏంజెలా నడిపించబోతున్నారు. తనను ఎన్నుకుంటూ చట్టసభ సభ్యులు వేసిన ఓటింగ్‌ను ఆమోదిస్తున్నట్టు ఏజెంగా బుధవారం పార్లమెంటు దిగువ సభలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment