బ్రిస్బేన్: భారత్‌లోని కేంద్రీయ విద్యాలయాల్లో తృతీయ భాషగా జర్మన్‌ను తొలగించి సంస్కృతాన్ని చేర్చిన అంశాన్ని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్.. ప్రధాని మోదీతో ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. భారతీయ విధానాలకు లోబడి తృతీయ భాష అంశంపై దృష్టి సారించగలనని హామీ ఇచ్చారు. జీ 20 సదస్సుకు హాజరైన ఇద్దరు నేతలు ఆదివారం భేటీ అయ్యారు. జర్మనీని సందర్శించాల్సిందిగా మెర్కెల్ మోదీని ఆహ్వానించారు. కాగా, సౌదీ ఉప ప్రధాని అల్ సౌద్ మోదీతో సమావేశమై భారత్‌కు అన్ని రంగాల్లో సహకరిస్తామని హామీ ఇచ్చారు.