German language
-
ఏపీ రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు
సాక్షి, అమరావతి: జర్మనీలో ఉద్యోగం చేసేందుకు ఎంపికైన 150 మంది బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు జులై 10వ తేదీ నుండి టక్ట్ ఇంటర్నేషనల్, ఆక్సిలా అకాడమీ బృందం సంయుక్తంగా జర్మన్ భాషలో రెండు నెలల పాటు శిక్షణనిస్తుందని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ నాయర్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కేఎల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్మనీ భాషలో శిక్షణ పొందిన అనంతరం B1 సర్టిఫికేట్ కు అర్హత సాధించాక జర్మనీలో వీసా పొందేందుకు వీలు కలుగుతుందని వెల్లడించారు. 150 మంది అభ్యర్థుల శిక్షణ ఖర్చును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అభ్యర్థులు కేవలం వీసా ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. జర్మన్ భాషా శిక్షణకు ఎంపికైన నర్సులందరికీ ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ అధికారిణి బి.నవ్య మాట్లాడుతూ విదేశీ భాషలో ప్రావీణ్యం సాధించడం ద్వారా మరిన్ని కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. జర్మనీలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు జర్మన్ భాషా శిక్షణా కార్యక్రమానికి క్రమం తప్పకుండా హాజరై ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులు భాషా వికాసం పెంపొందించుకోవాలన్నారు. టక్ట్ ఇంటర్నేషనల్ సీఈవో రాజ్ సింగ్ మాట్లాడుతూ ఆరుగురు జర్మన్ ట్రైనర్స్ తో సోమవారం నుండి (జులై 10) 150 మంది నర్సులకు జర్మన్ భాషలో శిక్షణ ప్రారంభిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై జర్మనీ భాషను నేర్చుకొని బీ1 సర్టిఫికేట్ పొందాలని సూచించారు. జర్మనీకి చేరుకున్న తర్వాత మరో 6 నెలలు మరింత క్షుణ్ణంగా భాషాపరమైన శిక్షణ అందిస్తామని, అనంతరం బీ2 సర్టిఫికేట్ అందుకుంటారని తెలిపారు. జర్మనీకి వెళ్లాక 6 నెలల పాటు భాష నేర్చుకునే అభ్యర్థుల బస మరియు సంబంధిత అవసరాల బాధ్యతను టక్ట్ ఇంటర్నేషనల్ చూసుకుంటుందన్నారు. నర్సింగ్ విభాగానికి చెందిన అభ్యర్థి వల్లి మాట్లాడుతూ క్లయింట్‌ను అర్థం చేసుకోవడానికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచస్థాయిలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తమకు ఈ అవకాశాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమకు వచ్చిన ఈ అవకాశం ముఖ్యమంత్రి దార్శనికతకు అద్దం పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ, కే.ఎల్ యూనివర్సిటీ అధికారులు, టక్ట్ ఇంటర్నేషనల్ బృందం తదితరులు పాల్గొన్నారు. -
‘జర్మన్’పై మెర్కెల్ ప్రస్తావన
బ్రిస్బేన్: భారత్‌లోని కేంద్రీయ విద్యాలయాల్లో తృతీయ భాషగా జర్మన్‌ను తొలగించి సంస్కృతాన్ని చేర్చిన అంశాన్ని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్.. ప్రధాని మోదీతో ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. భారతీయ విధానాలకు లోబడి తృతీయ భాష అంశంపై దృష్టి సారించగలనని హామీ ఇచ్చారు. జీ 20 సదస్సుకు హాజరైన ఇద్దరు నేతలు ఆదివారం భేటీ అయ్యారు. జర్మనీని సందర్శించాల్సిందిగా మెర్కెల్ మోదీని ఆహ్వానించారు. కాగా, సౌదీ ఉప ప్రధాని అల్ సౌద్ మోదీతో సమావేశమై భారత్‌కు అన్ని రంగాల్లో సహకరిస్తామని హామీ ఇచ్చారు. -
భాషణం: Break a Leg
ఆంగ్ల రంగస్థల నటులకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. స్టేజీ మీద వారు ‘మేక్బెత్’ అనే మాట వాడరు. ఒకవేళ ఆ నాటకం పేరు పలకవలసి వచ్చినా, ‘మేక్బెత్’కు బదులుగా ‘స్కాటిష్ ప్లే’ అంటారు. అదొక శాపపీడిత నాటకంగా ముద్రపడిపోడానికి కారణం మేక్‌బెత్‌ను ఎప్పుడు, ఎక్కడ ప్రదర్శించినా ఏదో ఒక విషాదం జరుగుతుండడమే! అలాగే నాటకం ప్రారంభానికి ముందు (అది ఏ నాటకమైనా) కళాకారులు ఒకరికొకరు ‘గుడ్‌లక్’ చెప్పుకోరు. అలా చేస్తే చెడు జరుగుతుందని, విధికి సవాల్ విసిరినట్లవుతుందని వారు నమ్ముతారు. అందుకే ‘గుడ్‌లక్’కి బదులుగా Break a leg అని విష్ చేసుకుంటారు. ఏమిటి ఈ ‘బ్రేక్ ఎ లెగ్ ’? జర్మన్ భాషలో hals und beinbruch అనే ఒక వ్యక్తీకరణ ఉంది. దానర్థం neck and leg break అని. ఆ ‘నెక్ అండ్ లెగ్ బ్రేక్’కి అర్థం ‘గుడ్ లక్’ అని. జర్మన్ భాష మాట్లాడేవారు, ఇడిష్ (జర్మనీ యూదులు మాట్లాడే ఒక భాష Yiddish) మాట్లాడే వారు 20వ శతాబ్దంలో అమెరికా వలస వచ్చినప్పుడు వారితోపాటు neck and leg break అనే మాట కూడా అమెరికన్లకు పరిచయమైంది. ఇలా వలస వచ్చినవాళ్లు ఎక్కువ మంది నటనారంగంలోని కళాకారులు, నిపుణులు కావడంతో క్రమంగా అది రంగస్థల పదబంధం అయింది. సినిమాలంటే ఏమిటో తెలియని కాలంలోనే అంటే... 18 వ శతాబ్దంలో ఒక ఆచారం ఉండేది. కొన్ని ప్రత్యేక సన్నివేశాలలో రంగస్థల నటులెవరైనా తమ పాత్రకు జీవం పోస్తున్నప్పుడు ప్రేక్షకులు మంత్రముగ్ధులవడాన్ని గమనించి చటుక్కున పాత్రలోంచి కొన్ని క్షణాల పాటు నటన ఆపి, అలా నిలబడిపోయేవారు. కరతాళధ్వనులకు ఆ ఆర్టిస్ట్ ఇచ్చే స్పేస్ అది. అంతా అభినందించాక, వేదిక మీదే మిగతా నటులనుంచి కాస్త ముందుకు వచ్చి ప్రేక్షకులకు వినమ్రంగా అభివాదం చేసి తిరిగి తను సీన్లోకి వెళ్లిపోయేవారు. అభివాదం కూడా తలను కాస్త దించి, ఒక మోకాలిని కొద్దిగా వంచి చేసేవారు. అలా మోకాలును వంచడమే breaking the leg. అదే ఆ తర్వాత break a leg అయింది.