
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో 41వ స్థానంలో నిలిచారు ఆర్థిక మంత్రి. నిర్మలా సీతారామన్‌తో పాటు హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషిణీ నాడార్ మల్హోత్రా, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్‌షా ఈ జాబితాలో నిలిచిన మిగతా భారతీయ మహిళలు. ఇక ఈ జాబితాలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వరుసగా పదో సారి ప్రథమ స్థానంలో నిలవగా.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ క్రిస్టిన్ లగార్డ్ వరుసగా రెండో సారి రెండో స్థానంలో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యాక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ తొలసారి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మొదటిసారే ఆమె ఏకంగా మూడో స్థానంలో నిలిచారు. (చదవండి: సూపర్ కుమార్)
Announcing the World's 100 Most Powerful Women of 2020: https://t.co/fSEkDPz9Nh #PowerWomen pic.twitter.com/8u6uB1LTYI
— Forbes (@Forbes) December 8, 2020
ఇక గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమితురాలైన నిర్మలా సీతారామన్ ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో రోషిణీ నాడార్ 55 స్థానంలో నిలవగా.. కిరణ్ మజుందార్ షా 68వ స్థానంలో నిలిచారు. ఇక ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన వారిలో 10 మంది దేశాధినేతలు, 38 మంది సీఈఓలు, ఐదుగురు ఎంటర్‌టైనర్లు ఉన్నారు. వీరందరి వయస్సు, జాతీయత, ఉద్యోగ వివరణలో విభిన్నంగా ఉన్నప్పటికి.. వారు 2020 లో తలెత్తిన ప్రత్యేకమైన సవాళ్లను పరిష్కరించడానికి వారు తమ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు "అని ఫోర్బ్స్ తెలిపింది.