ప్రతి ఏడాది అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ప్రపంచంలోని వంద మంది శక్తిమంతమైన మహిళల జాబితాను విడుదల చేస్తుంది. ఈసారి ఆ జాబితాలో నలుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి చోటు దక్కించుకుని 32వ స్థానంలో నిలిచారు. ఇక ఆమె తోపాటు మరో ముగ్గురు భారతీయ మహిళల్లో..హెచ్‌సీఎల్ కార్పోరేషన్ సీఈవో రోష్నీ నాదర్ మల్హోత్రా(60వ స్థానం), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ సోమ మొండల్(70వ స్థానం), బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా(76వ స్థానం)లో ఉన్నారు.
ఇక సీతారామన్ 2019లో భారతదేశ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. ఆమె కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు. అంతేగాక రాజకీయాల్లోకి రావడానికి ముందు సీతారామన్ యూకే ఆధారిత అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్‌లోనూ, BBC వరల్డ్ సర్వీస్‌లోనూ విభిన్న రోల్‌లో సేవలందించడమే గాక జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా పనిచేశారని ఫోర్బ్స్ పేర్కొంది. అలాగే హెచ్‌సీఎల్ కార్పోరేషన్ సీఈవో మల్లోహత్రా ప్రముఖ పారిశ్రామికవేత్త శివ్ నాడార్ కుమార్తె.
ఆమె హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్‌గా, కంపెనీకి సంబంధించిన అన్ని వ్యూహాత్మక నిర్ణయాలకు చాకచక్యంగా తీసుకుంటుందని వెల్లడించింది ఫోర్బ్స్. ఆమె తర్వాత స్థానంలో నిలిచిన మోండల్ సెయిల్‌కి మొదటి మహిళా చైర్‌పర్సన్ మాత్రమే గాక నాయకురాలిగా బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదిలోనే మూడు రెట్లు లాభలు అందుకున్నారు. ఆమె ఉక్కు తయారీ రంగంలో అనూహ్యంగా ఆర్థిక వృద్ధిని గడించి ఉక్కులాంటి మహిళ అని నిరూపించుకుందని ఫోర్బ్స్ పేర్కొంది. కాగా, ఫోర్బ్స్ ప్రకారం ఇది నాలుగు కీలక కొలమానాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయిస్తుంది. వాటిలో.. డబ్బు, మీడియా, ప్రభావం, ప్రభావ రంగాలు తదితరాలను పరిగణలోనికి తీసుకుంటుంది.
(చదవండి: ఎవరీ ప్రేరణ దేవస్థలి? ఏకంగా యుద్ధ నౌకకే అధికారిణిగా..!)
Comments
Please login to add a commentAdd a comment