మీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నాం: మోడీ
బ్రిస్బేన్: ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడుతున్నాయి. మీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నాం అని జర్మన్ ఛాన్సలర్ ఎంజెలా మార్కెల్ తో భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. జీ20 సమావేశాల సందర్బంగా మార్కెల్ తో మోడీ భేటి అయ్యారు. ప్రధాని వ్యాఖ్యలను విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు.
రెండవ రోజు సమావేశాల్లో ఆస్త్రేలియా ప్రధాని టోని అబాట్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కలిసి ఫోటోకు ఫోజిచ్చారు. ఈ సమావేశాల్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ సమావేశం కానున్నారు. రెండవ రోజు కూడా మోడీ సమావేశాల్లో, ఇతర నేతలతో బిజీ బిజీగా ఉన్నారు.