న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 20న జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో సమావేశం కానున్నారు. స్వీడన్, బ్రిటన్‌లలో పర్యటన అనంతరం తిరుగుప్రయాణంలో ఆయన బెర్లిన్‌లో కొద్ది సేపు ఆగనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. చాన్స్‌లర్ మెర్కెల్ సూచన మేరకు మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ సమావేశంలో ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారని తెలిపింది. ఈనెల 16, 17వ తేదీల్లో ప్రధాని మోదీ స్వీడన్‌లో పర్యటించనున్నారు. స్వీడన్‌లో జరిగే నార్డిక్ దేశాల డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్ ప్రధానమంత్రుల సమావేశంలో మోదీ పాల్గొంటారు. అనంతరం బ్రిటన్‌లో జరిగే కామన్‌వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment