
పుతిన్‌ది సోదని మెర్కల్ కళ్లు గిర్రున తిప్పేశారు
హాంబర్గ్: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశాల్లో చాలా విచిత్రమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్య హావభావాలు దర్శనమివ్వడంతోపాటు, డైలాగ్‌లు పేలుతున్నాయి. అదీకాకుండా ఈ సదస్సులో తొలుత కెమెరాలన్నీ కూడా ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులపై ఫోకస్ చేశాయి. ఆ ఇద్దరిలో ఒకరు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాగా మరొకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్. వీరిద్దరి మధ్య గోప్యంగా సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో కెమెరాలన్నీ వారి వైపే తిరిగాయి.
అయితే, అదే పనిలో ఉన్న మీడియా కెమెరాలు అనూహ్యంగా పుతిన్ వైపు జర్మనీ ఛాన్స్‌లర్ ఎంజెలా మెర్కల్ వైపు మళ్లాయి. ఆ సమయంలో ఒక విచిత్రమైన సన్నివేశం కనిపించింది. మెర్కల్ ఏదో విషయాన్ని పుతిన్‌తో చాలా సీరియస్‌గా చెబుతోంది. అది విన్న పుతిని దానికి అడ్డు చెబుతూ తన అభిప్రాయాన్ని వివరిస్తుండగా అబ్బో చెప్పావులో బహుబాగు అన్నట్లుగా ఆమె తన కళ్లను గిర్రున తిప్పారు. ఈ సీన్ మీడియా కళ్లలో పడగానే సోషల్ మీడియాలో పెట్టగా భారీగా చక్కర్లు కొడుతోంది.