
బెర్లిన్ : ముస్లింలు తమ దేశానికి చెందినవారు కాదంటూ తన అంతర్గత వ్యవహారాల మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కల్ జాగ్రత్త పడ్డారు. ముస్లింలు కూడా తమ దేశానికి చెందిన వారేనని, వారు కూడా ఇక్కడ మిగితా వారి మాదిరిగా హాయిగా జీవించొచ్చని చెప్పారు. ప్రస్తుతం స్వీడన్ పర్యటనలో ఉన్న ఆ దేశ ప్రధాని స్టీఫాన్ లాఫ్వెన్‌తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.
'మా దేశ సంస్కృతిలో ఇస్లాం కూడా ఒక భాగమే. క్రిస్టియానిటీ, జుడాయిజం మాదిరిగా మా దేశంలో ముస్లిం మతం కూడా ఉంది. జర్మనీలో నాలుగు మిలియన్ల మంది ముస్లింలు జీవిస్తున్నారు. వారి మతాన్ని పాటిస్తున్నారు. వారంతా ముమ్మాటికి జర్మనీకి చెందిన వారే.. వారి ఇస్లాం కూడా జర్మనీకి చెందినదే' అని ఆమె చెప్పారు. జర్మనీకి కొత్తగా వచ్చిన అంతర్గత వ్యవహారాల మంత్రి హాస్ట్ సీహోఫర్ ఓ జర్మనీ డెయిలీకి ఇంటర్వ్యూ ఇస్తూ ముస్లింలు జర్మనీకి చెందినవారు కాదని, దేశ సంప్రదాయాలు, సంస్కృతిలో వారు భాగం కాదని వేరు చేసి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment