మెర్కెల్ వలస విధానాలపై నిరసన
లీప్జిగ్: కొత్త విధానాలతో జర్మనీలోకి వలసలను ప్రోత్సహిస్తున్న చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌పై తూర్పు జర్మనీలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. గతేడాది తూర్పు జర్మనీలోకి శరణార్థులుగా (ఇస్లాం దేశాలనుంచి) వచ్చిన 11 లక్షల మంది.. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా స్థానిక మహిళలపై లైంగిక దాడులకు దిగారని.. వారిని దేశం నుంచి పంపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. యూరప్‌ను ఇస్లాంగా మార్చేందుకు పాశ్చాత్యదేశాలు ఒప్పుకోవంటూ లీప్జిగ్‌లో భారీ ర్యాలీలు నిర్వహించారు.