వైద్యులు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.
ముంబై: మహారాష్ట్రలో ఆందోళనకు దిగిన వైద్యులు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. డాక్టర్లకు తగిన భద్రత కల్పించేందుకు ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలని సూచించింది. వైద్యులు నిర్భయంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మళ్లీ 15 రోజుల తర్వాత మళ్లీ విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది.
ప్రభుత్వం తమకు తగిన భద్రత కల్పిస్తే పనిచేసేందుకు సిద్ధమని మహారాష్ట్ర రెసిడెంట్ వైద్యుల సంఘం(ఎంఏఆర్డీ) కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. విధుల్లో ఉన్న వైద్యుల దాడి చేసిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వ వైద్యులు సోమవారం నుంచి ముకుమ్మడి సెలవులు పెట్టి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. కాగా, వైద్యులు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విజ్ఞప్తి చేశారు.