నిజామాబాద్: హాజరు నమోదు కోసం ప్రవేశపెట్టిన నూతన విధానం తమను అవమానపరిచేదిగా ఉందంటూ నిజామాబాద్ జిల్లా కేంద్రం ఆస్పత్రి వైద్యులు, ప్రొఫెసర్లు సోమవారం విధులు బహిష్కంచారు. ఆస్పత్రిలో వైద్యాధికారులు సరిగ్గా విధులకు హాజరు కావటం లేదంటూ కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదులు అందాయి. ఇందుకు స్పందించిన కలెక్టర్ ఆస్పత్రిలో పంచింగ్ విధానాన్ని అమలు చేయాలని ఉత్తర్వులిచ్చారు. ఇందుకు నిరసనగా సోమవారం వైద్యులు, ప్రొఫెసర్లు విధులు బహిష్కరించారు. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.