పోలీసు అన్న పదానికే మచ్చ తెచ్చింది | she is not at all loyal to me from the beginning, says victim husband | Sakshi
Sakshi News home page

పోలీసు అన్న పదానికే మచ్చ తెచ్చింది

Published Sat, Nov 15 2014 2:26 PM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM

పోలీసు అన్న పదానికే మచ్చ తెచ్చింది - Sakshi

పోలీసు అన్న పదానికే మచ్చ తెచ్చింది

తన భార్య పోలీసు అన్న పదానికే మచ్చ తెచ్చిందని, ఇంతకు ముందు కూడా ఇలాగే కొన్నిసార్లు ఇంటికి ఆలస్యంగా రావడం లాంటి సంఘటనలు జరిగాయని మహిళా ఎస్ఐ భర్త సునీల్ వాపోయారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ స్వామితో కలిసి తన భార్యను పట్టుకున్నఅనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత సునీల్ మీడియాతో మాట్లాడారు. ఇంతకుముందు కొన్నిసార్లు తన భార్య ఆలస్యంగా ఇంటికి వచ్చేదని, ఎందుకని అడిగితే బస్సు ఫెయిలైనట్లు చెప్పేదని అన్నారు.

ఇంతకుముందు కూడా అనుమానం వచ్చినా, ఇప్పుడు మాత్రం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారని చెప్పారు. తాను హోటల్ గది తలుపు కొట్టినప్పుడు ఎవరు అని అడిగిందని,  మూడు సార్లు తలుపు కొట్టిన తర్వాత అప్పుడు నైటీ సర్దుకుంటూ వచ్చి తలుపు తీసిందని, తనను లోపలకు రావద్దని కూడా అడ్డుకుందని అన్నారు. తీరా తాను లోపలకు వెళ్లేసరికి లోపలి నుంచి సీఐ పరుగున బయటకు వచ్చారని తెలిపారు. కాగా, ఈ కేసులో కరీంనగర్ త్రీటౌన్ సీఐ స్వామితో పాటు వరంగల్ జిల్లాకు చెందిన మహిళా ఎస్ఐని కూడా బదిలీ చేశారు. వారిద్దరినీ డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వారిద్దరిపైన 407, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement