warangal SI
-
పోలీసు అన్న పదానికే మచ్చ తెచ్చింది
-
పోలీసు అన్న పదానికే మచ్చ తెచ్చింది
తన భార్య పోలీసు అన్న పదానికే మచ్చ తెచ్చిందని, ఇంతకు ముందు కూడా ఇలాగే కొన్నిసార్లు ఇంటికి ఆలస్యంగా రావడం లాంటి సంఘటనలు జరిగాయని మహిళా ఎస్ఐ భర్త సునీల్ వాపోయారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ స్వామితో కలిసి తన భార్యను పట్టుకున్నఅనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత సునీల్ మీడియాతో మాట్లాడారు. ఇంతకుముందు కొన్నిసార్లు తన భార్య ఆలస్యంగా ఇంటికి వచ్చేదని, ఎందుకని అడిగితే బస్సు ఫెయిలైనట్లు చెప్పేదని అన్నారు. ఇంతకుముందు కూడా అనుమానం వచ్చినా, ఇప్పుడు మాత్రం రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని చెప్పారు. తాను హోటల్ గది తలుపు కొట్టినప్పుడు ఎవరు అని అడిగిందని, మూడు సార్లు తలుపు కొట్టిన తర్వాత అప్పుడు నైటీ సర్దుకుంటూ వచ్చి తలుపు తీసిందని, తనను లోపలకు రావద్దని కూడా అడ్డుకుందని అన్నారు. తీరా తాను లోపలకు వెళ్లేసరికి లోపలి నుంచి సీఐ పరుగున బయటకు వచ్చారని తెలిపారు. కాగా, ఈ కేసులో కరీంనగర్ త్రీటౌన్ సీఐ స్వామితో పాటు వరంగల్ జిల్లాకు చెందిన మహిళా ఎస్ఐని కూడా బదిలీ చేశారు. వారిద్దరినీ డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వారిద్దరిపైన 407, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
దొరికిపోయిన సీఐ, ఎస్ఐలపై బదిలీ వేటు
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ, వరంగల్ మహిళా ఎస్ఐ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. మరోవైపు సీఐ స్వామితో పాటు మహిళా ఎస్ఐపై బదిలీ వేటు పడింది. వారిద్దర్ని డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసుల నుంచి ఫిర్యాదు వివరాలు సేకరించాలని వరంగల్ డీఐజీ మల్లారెడ్డి శనివారం కరీంనగర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఐజీ తెలిపారు. -
ఒకే హోటల్ గదిలో సీఐ, మహిళా ఎస్ఐ
-
ఒకే హోటల్ గదిలో సీఐ, మహిళా ఎస్ఐ
హైదరాబాద్ : గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కొట్టుకున్న ఘటన మరవక ముందే... పోలీస్ శాఖలోనే ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అబిడ్స్‌లోని హోటల్లో ఒకే గదిలో ఉన్న సీఐ, మహిళా ఎస్ఐని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ అసెంబ్లీ బందోబస్తు కోసం కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ స్వామి హైదరాబాద్ వచ్చారు. ఆయనకు లకడీకా ఫూల్ లోని ద్వారక హోటల్లో రూమ్ కేటాయించారు. అయితే సీఐ ద్వారకా హోటల్లో కాకుండా బృందావనం హోటల్లో దిగారు. అదే హోటల్లో వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళా ఎస్ఐ ఉన్నారు. వీరిద్దరూకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మహిళా ఎస్ఐ భర్త నగరానికి వచ్చాడు. సీఐ...తన భార్య ఇద్దరు కలిసి ఉండటాన్ని గమనించి అబిడ్స్ పోలీసులను ఆశ్రయించాడు. కాగా సీఐ స్వామి, మహిళా ఎస్ఐ ఒకే గదిలో ఉన్న సమయంలో ...మహిళా ఎస్ఐ భర్త సునీల్...గత రాత్రి 11 గంటల సమయంలో అబిడ్స్ పోలీసులకు పట్టించాడు. వారిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అబిడ్స్ పోలీసులు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు కేసు నమోదు చేశారు. సీఐ, ఎస్ఐలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.