నయన ఆయనకు హ్యాండిచ్చిందా | Nayanatara Hand To Director Arivalagan | Sakshi
Sakshi News home page

నయన ఆయనకు హ్యాండిచ్చిందా

Published Sat, Jun 23 2018 7:25 AM | Last Updated on Sat, Jun 23 2018 7:25 AM

Nayanatara Hand To Director Arivalagan - Sakshi

తమిళసినిమా: అగ్ర కథానాయకిగా వెలుగొందుతున్న నటి నయనతార. సూపర్‌స్టార్‌ నుంచి, యువ స్టార్స్‌ వరకూ పాత్ర నచ్చితే నటించడానికి రెడీ అంటున్న ఈ బ్యూటీ మరోపక్క లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల్లోనూ నటిస్తూ లేడీసూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది. తమిళం, తెలుగు భాషా చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార చాలా నెలల క్రితం దర్శకుడు అరివళగన్‌ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయన ఈ సంచలన నటి కోసం ఒక మంచి పవర్‌ఫుల్‌ లేడీ ఓరియెంటెడ్‌  కథను తయారు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే అప్పుడు చిత్ర వివరాలను వెల్లడించవద్దని నయనతార దర్శకుడితో చెప్పినట్లు టాక్‌. దీంతో ఆ తరువాత అరివళగన్‌ చిత్రానికి సంబంధించిన వివరాలేవీ మీడియాల్లో ప్రచారం కావడం లేదు.

నయనతార కూడా ఆ చిత్రం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అంతే కాదు ఆ చిత్రాన్ని పెండింగ్‌లో పెట్టి ఇతర చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా అరివళగన్‌ చిత్రంలో నటించడానికి నయనతార నిరాకరించినట్లు ప్రసారం సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. అయితే తను ఎందుకు ఈ చిత్రాన్ని దూరంగా పెట్టిందన్న విషయం తెలియలేదు. సుమారు ఏడాదికి పైగా దర్శకుడు అరివళగన్‌ను వెయిటింగ్‌లో పెట్టి ఇప్పుడు ఆయనకు హ్యాండ్‌ ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుందన్నది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్త అధికారికంగా చిత్ర వర్గాలు వెల్లడించలేదన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement